For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఎవ్వరినీ తప్పుపట్టడం లేదు : రమాప్రభ

    By Srikanya
    |

    హైదరాబాద్: 'ఆ రోజుల్లో ప్రేక్షకులకు ఏమి కావాలో అది ఇచ్చాం, ఇప్పటి ప్రేక్షకులకు ఏది కావాలో అది ఇస్తున్నారు'. ఈ పరిస్థితికి నేను ఎవ్వరినీ తప్పుపట్టడం లేదు అంటున్నారు సీనియర్ నటి రమాప్రభ. ఆమె ఓ తెలుగు లీడింగ్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే .. మంచి హాస్యానికి డైలాగ్ ఒక్కటే సరిపోదు, తగిన హావభావాలు కూడా ముఖ్యమే అని తేల్చి చెప్పారు.

    నేటి సిని పరిస్దితులని విశ్లేషిస్తూ..ఆనాటి పరిస్ధితులని వివరించారు. ఆమె మాటల్లోనే.... కథను పాత్రను అర్థం చేసుకుని ఎవరికి వారు చేసుకుంటూ పోయేవారం. సినిమాలో పాత్రలు పండాలంటే నటీ నటులు ముందు ఇగోను పక్కన పెట్టాలి. హాస్యనటులతో పనిచేస్తున్నా మా రోజుల్లో ఎవరిలోనూ ఇగోలుండేవి కావు. అసలా పదమే మాకు తెలియదు. ఎవరికి వారం పాత్రలో లీనమయ్యేవారం. ఎదుటి వారి డైలాగులు ఎలా ఉన్నాయి, నా డైలాగులు ఎలా ఉన్నాయి అనే పోలిక ఉండేది కాదు అన్నారు.

    ఇక ఒక్కోసారి సీనియర్ నటులు తమ పాత్రను తాము చక్కగా చేసుకుంటూ పోతున్నా, దర్శకులు మధ్యలో కట్ చెప్పిన సందర్భాలున్నాయి. వారి పాటికి వారు చేసుకుంటూ పోతే దర్శకునిగా నా గుర్తింపేంటనే భావనతో అలా చేసేవారు. ఇప్పుడీ పోకడ నటులు ప్రదర్శిస్తున్నారు. ఇగో ఎక్కువైపోయి, తమకిచ్చిన పాత్రపై కంటే ఎదుటి వారికిచ్చిన పాత్రపైన, డైలాగులపైనే దృష్టి పెట్టడంతో సీను కృతకంగా మారిపోతోంది. నిజానికి నైపుణ్యం లేనివారే ఇగో ప్రదర్శిస్తారు అని తేల్చి చెప్పారు.

    తన రోజుల్లో కామెడీ అనేది కుటుంబాల్లో ఒక భాగంగా ఉండేదని అన్నారు. రేలంగి- గిరిజ, పద్మనాభం- గీతాంజలి, రాజబాబు- రమాప్రభ... ఇలా హాస్యజంటలు ఉండేవి. ఈ పాత్రల ద్వారా ప్రేక్షకులకు ఏమి ఇవ్వాలో నటులకు తెలుసు, వారికేమి కావాలో ప్రేక్షకులకు తెలుసు. ప్రస్తుతం ఈ రెండూ కరువయ్యాయి. ఉరుకు పరుగుల జీవితం నుండి కొంత రిలాక్సేషన్ కోసం ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే చాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. నిర్దిష్టంగా ఇది కావాలని ప్రజలు ఆశించడం లేదు. దీంతో పరిశ్రమలోని వారు సైతం ఏదో ఒక విధంగా ఎంటర్‌టైన్ చేస్తే చాలులే అనుకుంటున్నట్లు అనిపిస్తోంది అన్నారు.

    English summary
    Rama Prabha is a famous Telugu actress who is most fondly remembered for her light roles. She had enacted in number of comical roles during her four decades tenure in film industry. She originates from Madanapalli where she was born in 1947 and was raised by her aunt after her parent demise. During her childhood she had to travel a lot due to which her studies got affected. This simple class family background lady Prabha did not think of landing into film industry. It was Pratyegatma who had first noticed her dancing talent and had given her the break to enter into the film industry as a sister to hero Krishnam Raju in Chilaka Gorinka film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X