twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ramaraju For Bheem.. రాజమౌళి సందేశం ఇదేనా.. రెండు టీజర్లతో క్లారిటీ వచ్చేసింది!

    |

    ఎన్నో నెలల నుంచి ఎదురుచూసిన ఆ తరుణం వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విశ్వరూపాన్ని దేశం మొత్తం చూసేసింది. రాజమౌళి హీరోలు అంటే హాలీవుడ్ సూపర్ హీరోలకు ధీటుగా ఉంటారని, చూపిస్తారని మరోసారి నిరూపించాడు. కొమురం భీంగా ఎన్టీఆర్‌ను అసమాన రీతిలో చూపించాడు. ప్రతీ ఒక్క షాట్ ఎన్టీఆర్‌ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేసింది. ఇక ఎన్టీఆర్ ఎంత అద్భుతంగా కనిపించాడో రామ్ చరణ్ అంతే అద్భుతంగా వినిపించాడు.

    Recommended Video

    #RamaRajuForBheem : Komaram Bheem NTR Teaser, Jr.NTR RRR First Look | #BheemforRamaraju, #RRR
    సాటి లేరువ్వరూ..

    సాటి లేరువ్వరూ..

    రామ రాజు కోసం భీం వచ్చినా.. భీం కోసం రామరాజు వచ్చినా అది మాత్రం రాజమౌళి ఊహా శక్తి నుంచే. ఓ హీరోను, హీరోయిజాన్ని ఎవ్వరికీ అంతుపట్టని, ఎవ్వరూ ఊహించని స్థాయిలో చూపెట్టడమంతే అది కేవలం రాజమౌళి తరువాతే. ఇక కేకే సెంథిల్ కుమార్ విజువల్స్, కెమెరా పనితనం ప్రతీ ఒక్క ఫ్రేములో కనిపిస్తుంది. కీరవాణి సంగీతం ప్రతి బిట్‌లో కనిపిస్తుంది. ఈ ముగ్గురు లేకుంటే రామరాజు, భీం అంత గొప్పగా కనపడే వారు కాదు వినబడే వారు కాదు.

    సందేశం అదేనా?

    సందేశం అదేనా?

    అల్లూరి సీతారామరాజు, కొమురం భీం అనే రెండు నిజ జీవిత పాత్రలను తీసుకుని దాని తన ఊహను, కల్పనను అల్లి ఆర్ఆర్ఆర్‌గా మలుచుతున్నాడు రాజమౌళి. పూర్తిగా దేశభక్తిని ప్రేరేపించే చిత్రం కాదని, ఇందులో యుద్దాలు కూడా ఉండవని తెలుస్తోంది. మామూలుగా చరిత్రలో అయితే ఈ ఇద్దరి కలిసినట్టు, పోరాడినట్టుగా ఎక్కడా కూడా లేదు. అయితే ఈ రెండు టీజర్లను చూస్తే రాజమౌళి ఇవ్వదల్చిన సందేశం ఏంటో తెలిసిపోయింది.

    రామరాజు అలా..

    రామరాజు అలా..

    రామరాజు కోసం భీం అంటూ రామ్ చరణ్ బర్త్ డేను నాడు విడుదల చేసిన టీజర్‌లో కొన్ని క్లూలు ఉన్నాయి. రామ్ చరణ్ మెడలో ఓం గుర్తున్న తాడు ఉంటుంది. పైగా సూర్య నమస్కారాలు, ధ్యానం వంటివి చేస్తుంటారు.అంతే హిందువునిగా చూపించాడు.

    ఎన్టీఆర్‌ను ఇలా..

    ఎన్టీఆర్‌ను ఇలా..

    ఇక కొమురం భీంగా ఎన్టీఆర్‌ను మరో లెవెల్‌లో చూపించాడు. ఎన్టీఆర్ తన మెడకు కట్టుకునే దానిపై ఉర్దూలో ఏదో రాసి ఉంది. ఇక చివరకు పైన టోపీ పెట్టుకుని, తెల్లటి వస్త్రాలను ధరించి వస్తున్నాడు. అంటే కొమురం భీంను ముస్లింగా చూపించినట్టు కనిపిస్తోంది.

    హిందూ ముస్లీం భాయ్ భాయ్..

    హిందూ ముస్లీం భాయ్ భాయ్..

    కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ నుంచి ఓ పోస్టర్ వచ్చింది. చేతులు కలుపుకుని, ఒకరి చేతిని మరొకరు పట్టుకున్నట్టున్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్, ఈ రెండు టీజర్లను గమనిస్తే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చివరకు సందేశం ఇచ్చేలా ఉన్నాడు. ఎలాగూ టీజర్లో నా అన్న అంటూ ఎన్టీఆర్.. నా తమ్ముడు అంటూ రామ్ చరణ్ ఒకరి గురించి మరొకరు బాగానే చెప్పుకున్నారు. ఇవన్నీ ఓకే గానీ అసలు జక్కన బుర్రలో ఎలాంటి ఆలోచనలున్నాయో ఎలా చూపిస్తాడో అన్నది ప్రశ్నార్థకమే.

    English summary
    Ram Charan Releases Jr Ntr's Komaram Bheem Teaser, Who else can describe the Might of Bheem in best way other than our Ramaraju... Introducing my Bheem to you...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X