RRR దెబ్బకు రికార్డులు బద్దలు.. టీజర్‌తోనే సంచలనాలు.. ఎన్టీఆర్ ఊర మాస్!!
ఐదారు నెలలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. ఆకలితో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ సత్తాను చాటారు. ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన కొమురం భీం టీజర్, అందులో ఎన్టీఆర్ విన్యాసాలు, దర్శకధీరుడు ఎన్టీఆర్‌ను చూపించిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. ఒక హీరోను ఆకాశమంత ఎత్తులో చూపించడంలో రాజమౌళి మించిన వారెవ్వరూ లేరని మరోసారి నిరూపించుకున్నాడు.

కొమురం భీం దెబ్బకు..
కొమురం భీంగా ఎన్టీఆర్ తన విశ్వరూపాన్ని చూపించాడు. జక్కన్న ఎలివేషన్ షాట్స్, కీరవాణి నేపథ్య సంగీతం, కెకె సెంథిల్ కుమార్ కెమెరా పనితనం, రామ్ చరణ్ వాయిస్ ఇలా అన్నీ కలిసి ఆర్ఆర్ఆర్ టీజర్‌ను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. పాత్రకు తగ్గట్టు ఎన్టీఆర్ తన తాను మార్చుకున్న తీరుకు అందరూ షాక్ అయ్యారు.

ట్రోలింగ్ కూడా..
అయితే ఈ టీజర్ ఎంతగా ఆకట్టుకుందో.. అంతే ట్రోలింగ్‌కు గురైంది. రాజమౌళిపై కాపీ క్యాట్ అనే ముద్రను మరోసారి నిరూపించుకున్నాడు. ప్రతీ ఒక్క షాట్‌ను దాని ఒరిజినల్ షాట్ ఎక్కడుందో దొరకపట్టి ట్రోల్ చేశారు. మరీ ముఖ్యంగా కొమురం భీంకు ముస్లిం గెటప్ వేయడంతో మరింత దారుణంగా ఏకిపారేశారు.

రికార్డుల మోత..
ట్రోలింగ్ సంగతి పక్కన పెడితే.. టాలీవుడ్‌లో మాత్రం ఆర్ఆర్ఆర్ టీజర్ రికార్డుల మోత మోగిస్తోంది. వన్ మిలియన్ లైకులు సాధించిన టీజర్‌గా కొమురం భీం టీజర్ నిలిచింది. ఇన్నాళ్ల ఆకలిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తానికి తీర్చుకున్నారు. అత్యంత వేగంగా వన్ మిలియన్ లైకులు సాధించిన టీజర్‌గా రికార్డులకెక్కింది.

ఫాస్టెస్ట్ టీజర్..
ఫాస్టెస్ట్ 100k, 200k, 300k,400k, 500k, 600k, 700k, 800k, 900k, 1M ఇలా ప్రతీ ఒక్క దాంట్లో ఆర్ఆర్ఆర్ టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. నిమిషాల్లోనే ఈ టీజర్ దూసుకుపోయింది. ఇక అన్ని భాషల్లోని వ్యూస్, లైకుల్లోనూ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
Recommended Video

అన్ని భాషల్లోని లెక్కలు..
ఆర్ఆర్ఆర్ టీజర్ ఇప్పటి వరకు తెలుగులో 17.54మిలియన్ల వ్యూస్, వన్ మిలియన్ లైకులను సాధించింది. హిందీలో 5.89 మిలియన్ వ్యూస్, 391k లైకులను, తమిళ్‌లో 2.04 మిలియన్ల వ్యూస్, 177k లైకులను, మలయాళంలో 1.87మిలియన్ల వ్యూస్, 134k లైకులను, కన్నడలో 1.60మిలియన్ల వ్యూస్, 130k లైకులను సాధించింది.


Click it and Unblock the Notifications











