'రమ్యకృష్ణ'పై అల్లు అరవింద్ ఒక్కసారిగా అంత మాటా?: స్టేజీపై ఉన్నవాళ్లు షాక్..

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లంటే.. అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవారు అన్న ఒక అభిప్రాయం బలంగా ఉంది. ఏడాది కూడా తిరగకుండానే చాపచుట్టేసే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. గట్టిగా ఐదేళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమే గగనం.

కానీ రమ్యకృష్ణ మాత్రం దీన్ని బ్రేక్ చేశారు. తొంభైల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మెప్పిస్తున్నారు. అలాంటి రమ్యకృష్ణపై నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

 'గ్యాంగ్'లో రమ్యకృష్ణ :

'గ్యాంగ్'లో రమ్యకృష్ణ :

హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'గ్యాంగ్' సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్దమైంది. సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో ప్రిరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్ ఎవరూ ఊహించని విధంగా రమ్యకృష్ణపై కామెంట్స్ చేశారు.

Recommended Video

Naa Peru Surya Teaser !
రమ్య.. నా హీరోయిన్:

రమ్య.. నా హీరోయిన్:

'గ్యాంగ్' సినిమా ట్రైలర్ లో సీరియస్ లుక్స్ తో రమ్యకృష్ణ ఆకట్టుకుంది. దీనిపై స్పందించిన అల్లు అరవింద్.. 'రమ్య కృష్ణ నా హీరోయిన్' అని కామెంట్ చేశారు. అరవింద్ కామెంట్‌తో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. స్టేజీపై ఉన్న ఇతర సెలబ్రిటీలు కూడా నవ్వేశారు.

 గతంలో ఉన్నఅనుబంధంతోనే..:

గతంలో ఉన్నఅనుబంధంతోనే..:

అల్లు అరవింద్ సొంత బేనర్‌లో రమ్యకృష్ణ కూడా గతంలో పలు సినిమాల్లో నటించారు. ఆ అనుబంధంతోనే అరవింద్ ఈ కామెంట్ చేశారు. ఫైనల్‌గా గ్యాంగ్ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని,తప్పకుండా అందరికి నచ్చుతుందని పేర్కొన్నారు.

 గ్యాంగ్ విశేషాలు:

గ్యాంగ్ విశేషాలు:

తమిళంలో తెరకెక్కిన 'తానా సేంద కూట్టం' చిత్రాన్నే తెలుగులో 'గ్యాంగ్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టూడియోగ్రీన్‌ బ్యానరుపై కేజీ జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

సూర్యపై అరవింద్:

సూర్యపై అరవింద్:

గజిని తెలుగులో అంత పెద్ద హిట్ కావడానికి.. తెలుగులో ఫాలోయింగ్ ఏర్పడటానికి తానే కారణమని సూర్య భావిస్తుంటాడని అల్లు అరవింద్ చెప్పారు. కానీ అందులో నిజం లేదన్నారు. సూర్య అద్భుతంగా నటించడం వల్లే గజిని అంత పెద్ద విజయం దక్కించుకుందన్నారు. ఇద్దరం కలిసి ఓ సినిమా చేయాలని ఐదేళ్లుగా ట్రై చేస్తున్నా కుదరడం లేదన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X