»   » ఆగస్టు చివరి వారంలో ‘రామయ్యా...’ ఆడియో

ఆగస్టు చివరి వారంలో ‘రామయ్యా...’ ఆడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' ఆడియో వేడుక ఆగస్టు చివరి వారంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 23న లేదా 25న డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. శిల్ప కళా వేదికలో ఈ వేడుక జరిగే అవకాశం ఉంది.

సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27 విడుదల చేస్తామని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల వెల్లడించారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు.

బాద్‌షా తర్వాత ఎన్టీఆర్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. టైటిల్‌కు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పంచ్‌ డైలాగ్స్‌, ఆయన ఎమోషనల్‌ కేరక్టర్‌ హైలైట్‌గా నిలుస్తాయని హరీశ్‌ శంకర్‌ అంటున్నారు.

మాస్ పల్స్ బాగా తెలిసిన హరీష్ శంకర్ అందుకు సంబంధించిన మసాలా సినిమాలో బాగానే దట్టించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

English summary
NTR’s next movie Ramayya Vastavayya audio will be released on August 23rd on 25th. Harish Shankar is directing this movie and produced by Dil Raju. Samantha and Shruthi Hasan are acting as heroines opposite NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu