పెద్దలకు మాత్రమే 'రామయ్యా వస్తావయ్యా'
హైదరాబాద్ : పెద్ద హీరోల సినిమాలన్నీ పెద్దలకు మాత్రమే సినిమాలుగానే ముస్తాబై వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్, సమంత జంటగా నటించిన చిత్రం 'రామయ్యా వస్తావయ్యా 'అదే రూట్ లో ప్రయాణం పెట్టుకుంది. శ్రుతిహాసన్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. సినిమా నిన్న సాయింత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్రానికి A సర్టిఫికేట్ ఇచ్చారు. చిత్రంలో ఉన్న యాక్షన్ సీన్స్ లో హింస ఉందని బట్టి ఈ సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమా మొత్తం మీద ఎక్కడా కట్స్ చెప్పకపోవటం విశేషం.
దిల్ రాజు మాట్లాడుతూ... ''ఎన్టీఆర్‌ని ప్రేమికుడిగా దర్శకుడు హరీష్ శంకర్ తెరపై చక్కగా ఆవిష్కరించారు. సమంత, శ్రుతిహాసన్ అందాలు సినిమాకి ఆకర్షణగా నిలుస్తాయి. అన్నివర్గాల వారినీ అలరించే చిత్రమవుతుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకి మంచి స్పందన వస్తోంది. ఈ వారంలో సినిమాని విడుదల చేస్తాము '' అని అన్నారు.
'గబ్బర్‌సింగ్' తరవాత హరీష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. కాబట్టి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తమన్ అందించిన పాటలు, కట్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై పెట్టుకొన్న ఆశల్ని రెట్టింపు చేశాయి. ''మీరు ఎన్ని అంచనాలు పెట్టుకొనైనా థియేటర్లకు రండి. సినిమా చూశాక అందరూ 'ఇది సూపర్‌హిట్' అంటారు. ఆ గ్యారెంటీ నాది..'' అని నిర్మాత దిల్‌రాజు కూడా భరోసా ఇస్తున్నారు.
కోటశ్రీనివాసరావు, ముఖేష్ రుషి, తనికెళ్ల భరణి, ప్రగతి, రవిశంకర్ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు,
కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications












