Don't Miss!
- News కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
‘మిర్చి’ సినిమాకి కూడా అలాగే... : హరీష్ శంకర్
అలాగే ...'ఎంత బడ్జెట్లో సినిమా తీయాలి. ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనేది నా చేతుల్లో ఉంది. రిలీజ్ అయ్యాక సినిమా సూపర్హిట్టా? బ్లాక్‌బస్టర్ హిట్టా అనేది ప్రేక్షకులే నిర్ణయించాలి. ఎన్టీఆర్‌కున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన పాత్రను డిజైన్ చేశాను. తారక్ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తాడు. ఒక్కసారి చూస్తే మళ్లీమళ్లీ చూడాలనిపించే చిత్రమిది. మాస్లో ఎన్టీఆర్‌కి ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను డిజైన్ చేశాను. తారక్ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తాడు. దర్శకుని మూడ్ బాగుండకపోతే... సినిమా సరిగ్గా రాదనే నమ్మే నిర్మాత దిల్ రాజు. అందుకే ఎలాంటి ఒత్తిడికీ లోను చేయకుండా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్కసారి చూస్తే... మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఇది' అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ....సినిమా ఫస్ట్ కాపీ చూశా. చాలా అద్భుతంగా వచ్చింది. ఎన్టీఆర్ మాస్ ఎలిమెంట్స్, మా బ్యానర్ తాలుక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హరీష్ యూత్ మార్క్. ఇలా అన్ని హంగులతో ఈ చిత్రం తెరకెక్కింది. 11వ తేదీ నాకూ, హరీష్‌కి బాగా కలిసొచ్చింది. అతని దర్శకత్వంలో 'గబ్బర్‌సింగ్' చిత్రం మే 11న, మా బ్యానర్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం జనవరి 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. డెఫినెట్‌గా ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుంది. 2013లో విడుదలైన టాప్ త్రీ సినిమాల్లో రామయ్యా వస్తావయ్యా చిత్రం కూడా ఉంటుంది. ఈ నెల 10న చిత్రాన్ని విడుదల చేయాల్సివుంది. అనివార్య కారణాల వల్ల 11న విడుదల చేస్తున్నాం. యాక్షన్ సన్నివేశాల్ని దృష్టిలో పెట్టుకొని సెన్సార్ వారు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు అన్నారు.