twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    10న ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’(అఫీషియల్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కథానాయకుడుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. సమంత, శృతి హాసన్ కథానాయికలు. తమన్ సంగీతం అందించారు. ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి.

    ఈ వారంలోనే ఆడియో విడుదల చేసి అక్టోబర్ 10వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్ధం అవడంతో అభిమానుల్లో సినిమా ఎప్పుడొస్తుందా? అనే టెన్షన్ తగ్గినట్లయింది.

    ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...'మా నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌లో 2008 అక్టోబర్ 9న 'కొత్తబంగారు లోకం', 2010 అక్టోబర్ 14న 'బృందావనం' విడుదలయి సూపర్ హిట్ అయ్యాయి. ఇపుడు 2013 అక్టోబర్ 10న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంతో మరో సూపర్ డూపర్ హిట్‌తో హాట్రిక్‌కి సిద్ధమవుతున్నాము' అన్నారు.

    ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తీరు తెన్నులు కొత్తగా తీర్చిదిద్దారని, తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ సూపర్‌గా ఉన్నాయని, ఆడియోని ఈ వారంలో నందమూరి అభిమానుల సమక్షంలో విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఛోటా కె.నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని తెలిపారు.

    ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని, బృందావనం చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయిన ఎన్టీఆర్ ఈ చిత్రంతో యూత్ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువవుతారని దిల్ రాజు తెలిపారు.

    English summary
    Young Tiger NTR’s ‘Ramayya Vasthavayya’ will hit the screens on October 10th. Director Harish Shankar and Producer Dil Raju officially revealed the release date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X