‘రామయ్యా వస్తావయ్యా’ టాక్, దిల్ రాజుకు చెమటలు!

By Bojja Kumar

హైదరాబాద్: ఓ వైపు తెలంగాణ ప్రాంతంలో పలు చోట్ల 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరికలు....మరో వైపు సీమాంధ్ర ప్రాంతంలో సీరియస్‌గా ఉన్న పరిస్థితి. ఇలాంటి సమయంలో కాస్త ధైర్యంగానే సినిమాను విడుదల చేసాడు నిర్మాత దిల్ రాజు. తన లక్కీ నెం.11 కావడంతో ముందుగా నిర్ణయించిన 10వ తేదీ కాకుండా 11వ తేదీన విడుదల చేసారు.

అయితే దిల్ రాజు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా....అటు పరిస్థితులతో పాటు, ఇటు అదృష్టం కూడా ఆయన్ను కరుణించనట్లే కనిపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు రామయ్యా వస్తావయ్య చిత్రాన్ని అడ్డుకున్నారు. సినిమా పోస్టర్‌లను చించి, దగ్ధం చేశారు. దీంతో సినిమా ప్రదర్శనకు అడ్డంకి ఏర్పడింది. సీమాంధ్ర ప్రాంతంలో పరిస్థితి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

Ramayya Vasthavayya movie talk

వీటికి తోడు సినిమా తొలి రోజే....టాక్ ఆశించినంతగా రాలేదు. 'రామయ్యా వస్తావయ్యా' యావరేజ్ మూవీ అని సగటు ప్రేక్షకుడి నుంచి వినిపిస్తున్న మాట. ఇలాంటి పరిణామాలు ఏ నిర్మాతకైనా చెమటలు పట్టించడం ఖాయం. మరి ఇలాంటి గడ్డు పరిస్థితులకు ఈ సినిమా ఎంత వరకు ఎదురీదగలదు? అనేది చూడాల్సిందే.

అయితే తొలిరోజు టాక్‌తో సినిమా భవిష్యత్‌ను పూర్తిగా అంచనా వేయలేం. గతంలో పలు సినిమాల విషయంలో తొలిరోజు టాక్ సరిగా లేకున్నా...హిట్ దిశగా దూసుకెళ్లాయి. మరి 'రామయ్యా వస్తావయ్యా' విషయంలో ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా? లేదా? అనేది చూడాల్సిందే.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X