twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ రంభ విడాకుల కేసును క్లోజ్ చేసిన కోర్టు!

    కొంతకాలంగా కోర్టులో నలుగుతున్న హీరోయిన్ రంభ విడాకుల కేసు వ్యవహారం ఎట్టకేలకు పరిష్కారమైంది. కోర్టు సూచనతో కలిసి మాట్లాడుకున్న రంభ, ఆమె భర్త ఇంద్రన్ కలిసి దాంపత్య జీవితం సాగించాలని నిర్ణయానికి వచ్చారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కొంతకాలంగా కోర్టులో నలుగుతున్న హీరోయిన్ రంభ విడాకుల కేసు వ్యవహారం ఎట్టకేలకు పరిష్కారమైంది. కోర్టు సూచనతో కలిసి మాట్లాడుకున్న రంభ, ఆమె భర్త ఇంద్రన్ కలిసి దాంపత్య జీవితం సాగించాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో కోర్టు కేసును క్లోజ్ చేసింది.

    కెనడాలో సెటిలైన ఎన్నారై బిజినెస్‌మేన్ ఇంద్రన్ పద్మనాథన్‌ను రంభ ఏప్రిల్ 8, 2010న రంభ వివాహమాడింది. తిరుపతిలో వీరి వివాహం అంగరంగ వైభంగా జరిగింది. పెళ్లి తర్వాత కెనడాలో స్థిరపడింది. వీరికి ఇద్దరు పిల్లలు.

    2016లో విడాకుల కోసం కోర్టుకు

    2016లో విడాకుల కోసం కోర్టుకు

    ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు కోరుతూ 2016 లో రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిల్లల సంరక్షణ కోసం నెలకు రూ .2.50 లక్షలు చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని కోర్టును కోరింది.

    కోర్టు సూచనతో

    కోర్టు సూచనతో

    ఈ కేసును పలుమార్లు విచారించిన కోర్టు...... ఇద్దరూ మరోసారి మాట్లాడుకుని నిర్ణయానికి రావాలని సూచించింది. రంభ, ఇంద్రన్ చర్చించుకున్న అనంతరం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇద్దరూ బుధవారం కోర్టుకు తెలియజేసారు. దీంతో కోర్టు ఈ కేసును మూసి వేసింది.

    ఇక నో సినిమాలు

    ఇక నో సినిమాలు

    రంభ విడాకుల వ్యవహారం, కోర్టు కేసుల నేపథ్యంలో చాలా మంది ఆమె త్వరలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందని ఎదురు చూసారు. అయితే ఆమె తాజా నిర్ణయంతో రంభ మళ్లీ సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదని తేలిపోయింది.

    రంభ

    రంభ

    రంభ మన తెలుగు అమ్మాయి అనే విషయం తెలిసిందే. విజయవాడలో విజయలక్ష్మిగా పుట్టిన ఆమె సినిమాల్లోకి వచ్చాక రంభగా పేరు మార్చుకున్నారు. వందకు పైగా చిత్రాల్లో దాదాపు అందరూ అగ్రహీరోలతో ఆమె నటించారు.

    English summary
    Ramba’s husband Indran wednessday appeared before the court and submitted a petition stating that he has reconciled with Ramba and the couple have planned to continue their marriage. The court closed the case following this positive move.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X