హల్ చల్ చేస్తున్న ‘రాంబాబు’ డైలాగ్స్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వరలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పవన్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య యూనివర్శల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన డైలాగులు కొన్ని లీకై నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ డైలాగుల్లో పూరి మార్కు స్పష్టంగా కనిపిస్తోంది.
ఓరేయ్, నిన్ను కొట్టేయాలని ఉందిరా... వెళ్లి మనుషుల్ని తెచ్చుకో..
వీడు మంచోడా, చెడ్డోడా, తిక్కోడా.... అని తెలుసుకోవడానికి ట్రై చేయకు, నీ గుండెకికి, బ్రెయిన్‌కి ఉన్న కనెక్షన్ కట్ అయిపోద్ది
గుండాలని, గుండుబా కాసే వారికి బయపడటానికి నేను పోలీస్ ని, పోలిటికల్ లీడర్ని కాదు... ప్రెస్ ప్రెస్ ప్రెస్
ప్రకాష్ రాజ్: రేయ్! ఈ స్టేట్ నీదా?
పవన్ కళ్యాణ్: స్టేట్ కాదురా.. స్టేట్‌లో ఉన్న వాళ్లు నావాళ్లు
ప్రకాష్ రాజ్: రూల్స్ పాస్ చేస్తున్నావ్... నువ్వు సీఎంవా?
పవన్ కళ్యాణ్: అవును సీఎంనే... అంటే కామన్ మ్యాన్‌ని
ఇలాంటి పంచ్ డైలాగులు పూరి జగన్నాథ్ బోలెడు రాసాడు. అభిమానులతో క్లాప్స్ కొట్టించే అద్భుతమైన డైలాగులు రాయడంతో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకన్న పూరి జగన్నాథ్ ఈచిత్రానికి తన క్రియేటివీటిని అంతా పదును పెట్టి అదరిపోయేలా డైలాగులు, స్ర్కిప్టు రెడీ చేసారు.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాన్‌కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. అమ్మడు అందాల ప్రదర్శనపై కూడా ఈచిత్రంలో బాగా ఫోకస్ చేసారని సమాచారం. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ఆడియో విడుదల చేసిన అక్టోబర్ 11న సినిమాను విడుదల చేయన్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











