రంభపై కేసు వెనక బంగారు నగల వ్యవహారం!

By Bojja Kumar

హైదరాబాద్: సినిమా హీరోయిన్ రంభపై వరకట్నం వేధింపులకు సంబంధించిన కేసు నమోదు కావడం ఆమె అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఫిర్యాదు మేరకు పోలీసులు 498 (ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేసారు.

అదనపు కట్నం తేవాలంటూ తనను వేధిస్తున్నారంటూ పల్లవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదులో భర్త శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచు రంభ, ఆమె తల్లిదండ్రులపై కూడా పల్లవి ఆరోపణలు చేసారు. అయితే రభ సోదరుడు శ్రీనివాస్ మాత్రం పల్లవి ఆరోపణలను ఖండించారు. పల్లవి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసారు.

Rambha case: Srinivas Denied Pallavi's allegation

పల్లవి ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తోందని, ఆమె కుటుంబ సభ్యులే ఆమెతో ఇలా చేయిస్తున్నారని, తమ పరువు బజారుకీడ్చడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. రంభపై ఆరోపణలు చేస్తే సహించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రంభపై కేసు పెట్టడం వెనక నగల వ్యవహారం ఉన్నట్లు శ్రీనివాస్ వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. 'పల్లవి అక్కకి ముంబైలో గోల్డ్ బిజినెస్ ఉంది. ఆమె షాపులో నగలు ప్రదర్శన కోసం రంభ నగలను తీసుకెళ్లింది. మళ్లీ అడిగితే ఎంతకూ తీసుకురాలేదు. చాలా కాలం తర్వాత నగలు మా ఇంటికి పంపకుండా హైదరాబాద్ పంపారు. పల్లవి వెళ్లి ఆ నగలు తీసుకొచ్చారు. అనుమానం వచ్చి చెక్ చేస్తే అవి నకిలీ నగలు అని తేలింది. ఇలా ఎందుకు చేసారు అని అడిగితే....మాపై వరకట్నం వేధింపులు అంటూ తప్పుడు కేసు పెట్టారు' అని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. రంభకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు. మా పెళ్లయి 15 సంవత్సరాలయింది. కట్నం కోసం వేధించాల్సిన అవసరం నాకు లేద అని శ్రీనివాస్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X