అప్పుడేనా...రంభ ఖండన

వాస్తవానికి ఇది ద్విభాషా చిత్రం. తమిళంలో ఈ చిత్రం 'విడియుమ్ వరై కాతిరు' పేరుతో రూపొందుతోంది. ఈ సినిమాతో నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె తమిళ ప్రేక్షకులకు కనిపించబోతోంది. తెలుగులో ఇదివరకు 'దొంగ సచ్చినోళ్లు' సినిమాలో హీరోయిన్‌గా నటించాక, ఆమె చేస్తున్న సినిమా 'ప్రతిక్షణం'. సినిమాలు తక్కువై పోవడంతో రంభ టీవీవైపు దృష్టి సారిస్తున్నదనీ, టీవీ సీరియళ్లలో నటించ బోతున్నదనీ ఈమధ్య రూమర్లు వ్యాపించాయి.దీనికి కారణం, తమిళంలో ఆమె ఒక రియాలిటీ షోకి జడ్జిగా వ్యవహరించడం. దీనివల్లే తాను టీవీ సీరియళ్లలో నటించబోతున్నట్లు ప్రచారం జరిగిందనీ, ఇందులో ఏమాత్రం నిజం లేదనీ రంభ తెలిపింది."నన్ను ఉద్వేగానికి గురిచేసే పాత్రలు వస్తే అప్పుడు టీవీ కెరీర్ గురించి ఆలోచిస్తా. అది కూడా వెండితెర నుంచి నేను దూరమయ్యాక మాత్రమే'' అని రంభ చెప్పింది.


Click it and Unblock the Notifications











