రంభ వివాహ మూహూర్తం..వెన్యూ
ఈ నెల 8న తిరుపతిలో ఉదయం 11 గంటల 44 నిమిషాలకు రంభ,ఇంద్రకుమార్ దంపతులు కాబోతున్నారు. ఏడుకొండలపైన గల కర్ణాటక కళ్యాణమండపం ఇందుకు వేదిక కానుంది. అక్కడ కనులు మిరుమిట్లు గొలిపే ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. కెనడాకు చెందిన మేజిక్ వుడ్స్ సంస్థ అధినేత ఇంద్రకుమార్ ఆమెతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో చేసుకుంటున్నారు. ఇక రిసెప్షన్‌ను కూడా భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. చెన్నైలోని రాణీ మేయమ్మ హాలులో ఈ వేడుక జరుగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. 'రంభ శుభలేఖ' ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. పూర్వకాలం మహారాజుల ఆహ్వాన పత్రిక తరహాలో ఈ శుభలేఖను డిజైన్ చేశారు. జైపూర్ లో ప్రత్యేకంగా ఈ శుభలేఖను డిజైన్ చేయించామని రంభ సోదరుడు వాసు చెప్పారు.
రంభ ఇంద్రకుమార్ కర్ణాటక కళ్యాణ మండపం తిరుమల తిరుపతి శుభలేఖ చెన్నై రాణీ మేయమ్మ rambha indrakumar tirupati chennai wedding card


Click it and Unblock the Notifications