సర్వాంగ సుందరంగా రంభ వివాహం నేడే

By Srikanya

ప్రముఖ సినీ నటి రంభ వివాహం తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ రోజు(గురువారం) ఉదయం 11.44 గంటలకు జరగనుంది. కెనడాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్‌ తో జరగనున్న వివాహానికి కర్ణాటక కళ్యాణ మండపం వేదిక కానుంది. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు అవుతున్నారు. ఇక కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంభ కుటుంబీకులు నలభై మంది బుధవారం ఉదయం తిరుమల చేరుకుని శ్రీ పద్మావతి అతిథిగృహ ప్రాంతంలో బసచేశారు. ఈ ఆరునెలల వ్యవధిలో హీరోయిన్లు మీనా, శ్రీదేవిల వివాహాలు తిరుమలలోనే జరిగాయి. ఇక రంభ పెళ్లి లైవ్ హక్కులను ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ వారు భారీ మొత్తానికి తీసుకున్నారని సమాచారం.

ఇక రిసెప్షన్‌ ను కూడా భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. చెన్నైలోని రాణీ మేయమ్మ హాలులో ఈ వేడుక జరుగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. 'రంభ శుభలేఖ' ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. పూర్వకాలం మహారాజుల ఆహ్వాన పత్రిక తరహాలో ఈ శుభలేఖను డిజైన్‌ చేశారు. జైపూర్ ‌లో ప్రత్యేకంగా ఈ శుభలేఖను డిజైన్‌ చేయించామని రంభ సోదరుడు వాసు చెప్పారు.అలాగే పెళ్ళయిన తర్వాత రంభ నటిస్తానని చెప్తోంది. రంభకు ధట్స్ తెలుగు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X