రామ్ చరణ్ ‘ఆరెంజ్’ లో మెరువనున్న అందాల నటి...
రామ్ చరణ్ తేజ్ హీరోగా, జెనీలిలయా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మిస్తున్న చిత్రం 'ఆరెంజ్". గత రెండు రోజుల క్రితం విడుదలైన ఆ చిత్రంలోని పాటలు ఆడియో రంగంలో విజయం సాధించాయి. నవంబర్ లో రిలీజ్ కు సిద్దమవుతున్న ఈ చిత్రంలో రంభ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తోందట. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు కరువై పోతున్న రోజుల్లో నేనున్నాంటూ అందరినీ ఆకట్టుకుంది రంభ. ఈ పాలబుగ్గల సోయగాలతో చిత్రసీమలో అడుగుపెట్టిన రంభ ఈ మధ్య నే ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్ళాడి ఒ ఇంటిదైంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత రంభ మరింత అందంగా తయారైందట. మరి ఆ అందంతో వస్తున్న రంభ'ఆరంజ్" సాంగ్ ని ప్రేక్షకులను ఏ రేంజ్ కు తీసుకెలుతుందో లేదో వేచి చూడాల్సిందే.
రంభ రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ నాగబాబు rambha ram charan teja orange genelia bommarillu bhaskar nagababu


Click it and Unblock the Notifications