For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సెక్సీ హీరోయిన్ రంభ పెళ్లి పెటాకులైందా?(ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  చెన్నై: రంభ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే....ఆ మధ్య ఓ ఎన్నారై బిజినెస్ మేన్‌ను పెళ్లాడిన రంభ ఇప్పుడు ఆయనతో విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుడ్ న్యూస్ ఏమిటంటే రంభ మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతోంది.

  సినీ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్ ఏమిటంటే...ఆమె మ్యారేజ్ లైఫ్ ఎండ్ అయిందని, ప్రస్తుతం ఆమె భర్తతో విడిగా ఉంటోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె విదేశాల నుంచి తిరిగి వచ్చి చెన్నైలోనే ఉంటోందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినిమా వాళ్లు సినిమా ఆఫర్లతో ఆమె వద్దకు వెలుతున్నారట.

  కెనడాలో సెటిలైన ఎన్నారై బిజినెస్‌మేన్ ఇంద్రన్ పద్మనాథన్‌ను రంభ ఏప్రిల్ 8, 2010లో వివాహ మాడింది. తిరుపతిలో వీరి వివాహం అంగరంగ వైభంగా జరిగింది. పెళ్లి తర్వాత ఆమె భర్తతో కలిసి టోరంటో వెళ్లి పోయింది. ఈ దంపతుల దాంపత్యానికి గుర్తుగా జనవరి 14, 2011న ఆడ పిల్ల జన్మించింది.

  2012లో కూడా రంభ తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుందని వార్తలు వెలువడ్డాయి. కానీ రంభ అప్పుడు ఈ వార్తలను ఖండించింది. భర్త ఇంద్రన్, కూతురు లావణ్యతో టోరంటోలో సంతోషంగా ఉన్నానని అప్పట్లో వివరణ ఇచ్చింది. మళ్లీ తాజాగా రంభ భర్తతో విడిపోయినట్లు రూమర్లు గుప్పుమన్నాయి. ఆమె తిరిగి చెన్నైరావడం, సినిమాల్లోనటించాలనే నిర్ణయానికి రావడం ఈ రూమర్లకు మరింత బలాన్నిస్తున్నాయి. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

  పుట్టింటికి చేరిన రంభ

  పుట్టింటికి చేరిన రంభ


  కారణం ఏమిటో తెలియదు కానీ....రంభ ఇపుడు మెట్టినింటి నుంచి పుట్టింటికి చేరింది. ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. పలువురు ఫిల్మ్ మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

  రంభ కోసం తలుపు తెరిచే ఉన్నాయి

  రంభ కోసం తలుపు తెరిచే ఉన్నాయి


  రంభ కోసం సినిమా పరిశ్రమ తలుపులు తెరిచే ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. హీరోయిన్ పాత్రలతో పాటు ఇతర ఏ పాత్రలు చేయడానికి సిద్ధమైనా...అందుకు సంబంధించిన కథలతో ఫిల్మ్ మేకర్స్ రెడీగా ఉన్నారట.

  రంభ మనసులో..?

  రంభ మనసులో..?


  పలువురు ఫిల్మ్ మేకర్స్ ఆమెకు పలురకాల పాత్రలు ఆఫర్ చేస్తున్నా...రంభ ఆలోచన మాత్రం వేరేలా ఉంది. తన రీ ఎంట్రీ హైలెట్‌గా ఉండాలనే ఆలోచనలో రంభ ఉంది.

  శింబు సినిమాలో

  శింబు సినిమాలో


  చెన్నై సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె శింబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది.

  ఆమె పాత్ర ఏమిటంటే..

  ఆమె పాత్ర ఏమిటంటే..


  ఈ చిత్రంలో రంభ శింబుకు అక్క పాత్రలో నటిస్తోందట. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు.

  టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు

  టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు


  కేవలం తమిళ సినిమాల్లోనే కాదు...తెలుగు సినిమాల్లోనూ పలువురు ఫిల్మ్ మేకర్స్ రంభతో పాత్రలు చేయించడానికి సుముఖంగా ఉన్నారు.

  100కు పైగా సినిమాల్లో...

  100కు పైగా సినిమాల్లో...


  రంభ హీరోయిన్‌‍గా సౌతిండియా సినిమాల్లో దాదాపు 100కు పైగా నటించింది. తన సెక్సీ అందాలు, అభినయంతో ఆకట్టుకుంది.

  ఫ్యాన్ ఫాలోయింగ్

  ఫ్యాన్ ఫాలోయింగ్


  రంభకు కన్నడ, తమిళం, తెలుగు, మళయాలంతో పాటు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఆమెకు సౌత్‌లో ఫాలోయింగే ఎక్కువ.

  సౌత్ స్టార్లతో రంభ

  సౌత్ స్టార్లతో రంభ


  సౌతిండియాలో పాపులర్ యాక్టర్లు అయిన రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, మమ్ముట్టీ, కలాభవన్ మని, వి రవిచంద్రన్, కార్తీక్ ముత్తురామన్, జయరాం...ఇలా చాలా మంది పాపులర్ స్టార్లతో కలిసి నటించింది.

  బాలీవుడ్లో..

  బాలీవుడ్లో..


  బాలీవుడ్ రంభ మిథున్ చక్రవర్తి, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సునీల్ శెట్టి, విజయ్, గోవింద తదితరులతో కలిసి నటించింది.

  బుల్లితెరపై రంభ

  బుల్లితెరపై రంభ


  కేవలం వెండి తెరపై మాత్రమే కాదు...పలు బుల్లితెర కార్యక్రమాల్లోనూ రంభ ఎంట్రీ ఇచ్చింది. కలైంగర్ అనే టీవీ ఛానల్ లో Maanada Mayilada అనే కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించింది.

  English summary
  It is a mixed bag for all those Rambha's fans. The bad news is that her marriage with an NRI businessman has reportedly ended. Well, the good news is that the actress is all set to return to acting.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more