నా బిడ్డకి లండన్ వారసత్వం కావాలనే అలా ప్లాన్ చేసా...రంభ
రంభ తనకు పుట్టబోయే బిడ్డకు లండన్ వారసత్వం కావాలని కోరుకుంటోంది. అందుకోసం ఆమె లండన్ లోనే కొంత కాలంగా ఉంటోంది. త్వరలోనే ఒక బిడ్డకు తల్లికాబోతోంది. జనవరిలో డెలివరీ అవుతుందని డాక్టర్స్ చెప్పారు. రంభ తన భర్తతో కలసి దీపావళిని చెన్నైలో జరుపుకోవాలని ఆశపడ్డారు. అయితే ఒకవేళ చెన్నైలోనే బిడ్డకు జన్మనిస్తే లండన్ వారసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందనే భయంతో ప్రయాణాన్ని విరమించుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, భోజ్‌పురి తదితర భాషల్లో హీరోయిన్‌గా నటించి ఒక వెలుగు వెలిగిన రంభ కెనడాకు చెందిన ఇంద్ర కుమార్ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుని సెటిల్ అయింది. వివాహానంత రంభ కూడా కొన్ని చిత్రాల్లో నటించిన ఈమె ఇటీవల తెలుగులో రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆరెంజ్ చిత్రంలో ఓ ఐటం సాంగ్ చేసింది.
More from Filmibeat
రంభ ఆరెంజ్ రామ్ చరణ్ తేజ్ భాస్కర్ లండన్ దీపావళి ఇంధ్రకుమార్ rambha orange ram charan teja bhaskar london indra kumar


Click it and Unblock the Notifications











