మేం చేసిన అల్లరి అంతా ఇంతా కాదు: రామ్ చరణ్
హైదరాబాద్ : పరిశ్రమలోనూ చాలామంది స్నేహితులున్నారు. రానా నా బెంచ్ మేట్. మేమిద్దరం చాలా క్లోజ్. మేం చేసిన అల్లరి అంతా ఇంతా కాదు అంటున్నారు రామ్ చరణ్. తన చిన్నప్పటి రోజులును స్నేహితుల దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుంటూ మాట్లాడారు.
అలాగే..శర్వానంద్ కూడా అంతే. పరిశ్రమకి రాకముందునుంచీ నాకు తెలుసు. ఒకరి విజయాన్ని మరొకరు మనసారా ఆస్వాదిస్తాం. ఎవరికి హిట్టొచ్చినా నాకొచ్చినట్టే అనుకొంటాం. ఎలాంటి స్వార్థం లేని స్నేహం దొరికినందుకు గర్వంగా అనిపిస్తుంటుంది'' ..అన్నారు రామ్‌చరణ్

అయితే బెస్ట్ ప్రెండ్ మాత్రం తన తండ్రే అని అన్నారు. ''నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్. ఏ విషయం గురించైనా ఆయనతో చర్చించే చనువు నాకుంది. బిజీగా ఉన్నా.. నా దగ్గర నుంచి ఫోన్ వస్తే.. తప్పకుండా స్పందిస్తారు. నాకు ఏది మంచో.. నా కంటే డాడీకే బాగా తెలుసు. నా గురించి ఆయన తీసుకొనే శ్రద్ధ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది'' అని చెప్పుకొచ్చారు.
శర్వానంద్ మాట్లాడుతూ... ''చిన్నతనం నుంచి నేనెప్పుడూ ప్రత్యేకంగా స్నేహితుల దినోత్సవం జరుపుకోలేదు. ఎందుకంటే నాకు వూహ తెలిసినప్పటి నుంచి స్నేహితులతో గడిపిన ప్రతిక్షణం ప్రత్యేకంగానే భావిస్తూ వచ్చాను. నేను, విక్కీ, రామ్‌చరణ్.. ఇలా నా స్నేహితుల జాబితా చాలా పెద్దదే ఉంది. మేమందం కలిస్తే మా ఆనందానికి హద్దులుండవు.'' అన్నారు.
అలాగే... ఈ ఏడాదైతే నాకు రెండు రోజుల ముందుగానే స్నేహితుల దినోత్సవం వచ్చేసింది. ఎలా అంటారా.. నా ప్రాణ స్నేహితుడు నిర్మాత విక్కీ 'రన్ రాజా రన్' లాంటి హిట్ సినిమాను ఇచ్చాడు. ఇంతకుమించి బహుమతి ఏముంటుంది?. ఈ సినిమా విడుదల రోజు స్నేహితులందరూ ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఇంతకుమించిన ఆనందం ఏముంటుంది అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











