రామ్ చరణ్ తేజ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రానున్న చిత్రలో చరణ్ స్టంట్ మేన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పునర్జన్మల చుట్టూ తిరిగే ఈ కథ ప్రకారం చరణ్ ఈ కాలంలో ఫైట్స్ చేస్తూ బ్రతికుతూంటాడు. అక్కడ ఫ్యాషన్ డిజైనర్ గా వచ్చిన కాజల్ పరిచయమవుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే గతంలో దాదాపు 400 సంవత్సరాల క్రిందటే వీరి ప్రేమ మొలకెత్తుతుంది. అప్పుడు శ్రీహరి పాత్ర వల్ల వీరు విడిపోతారు. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు మధ్య మరో రకమైన శక్తులు అడ్డుపడతాయి. ఈ జన్మలో శ్రీహరి వీరిని కలపటానకి ప్రయత్నిస్తాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని మిగతా కార్యక్రమాలకు రెడీ అవుతుంది.
Story first published: Thursday, July 16, 2026, 23:51 [IST]