మొత్తానికి రామ్ చరణ్ తేజ కొత్త సినిమాని ఎవరు డైరక్ట్ చేయనున్నారా అనే ముడి వీడింది. అందరూ ఊహించినట్లుగానే బొమ్మరిల్లు భాస్కర్ ఆ అవకాశాన్ని అందుకున్నాడు. గాంధీ జయింతి(అక్టోబర్ 2) నుండి ప్రారంభమయ్యే ఈ సినిమాని అతని బాబాయ్ నాగబాబు నిర్మించనున్నారు. అంజనా ప్రొడక్షన్స్ పై రాబోయే ఈ చిత్రానికి కొద్ది రోజులుగా భాస్కర్ స్టోరీ సిట్టింగ్స్ జరుపుతున్నారని.. దాదాపుగా ఫైనల్ స్క్రిప్టు రెడీ అయిందని తెలుస్తోంది. అలాగే భాస్కర్ తన గత చిత్రాలు లోలాగేన ఈ చిత్రంలోనూ రామ్ చరణ్ ని ఫ్యామిలీ హీరోగానే చూపెట్టనున్నట్లు సమాచారం. స్టోరీ పాయింటుగా రోజు రోజుకీ పతన మవుతున్న మానవ సంభంధాలను హీరో నిలబెట్టే ప్రయత్నం చేయటమే అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ ...ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో పునర్జ్నమ్మ ల కాన్సెప్ట్ తో సాగే చిత్రంలో చేస్తున్నారు.