రామ్ చరణ్ బర్త్ డే, శుభాల డే
రామ్ చరణ్ తేజ ఈ ఉగాది నాడు తన 24 వ జన్మ దినం జరుపుకుంటున్నాడు. ఈ ఉగాది అతనికి, ఆయన తండ్రి చిరంజీవికి ఎన్నో శుభాలు తెచ్చి పెట్టింది. గత వారం రామ్ చరణ్ ఒక సాఫ్ట్ డ్రింక్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. నేడు చిరంజీవి తన ప్రజారాజ్యం తొలి జాబితా విడుదల చేశారు. ఉగాది రోజులే ప్రజారాజ్యం ఉమ్మడి గుర్తుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజారాజ్యానికి వారు కోరుకున్న రైలు బండి గుర్తు ఖరారైనట్టే. ఎన్నికల సంఘం దీనిపై సోమవారం నిర్ణయం తీసుకుంటుంది. రామ్ చరణ్ తన జన్మ దినాన్ని కుటుంబ సభ్యులతో "మగధీర" యూనిట్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











