సంక్రాంతికి రాంచరణ్ సందడి.. బోయపాటి సినిమా వచ్చేది అప్పుడే!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం విడుదల ఖరారైంది. ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాత డివివి దానయ్య అధికారికంగా ప్రకటన చేసారు.
ఈ ఏడాది వేసవిలో ముందుగా అడ్డుపెట్టి రంగస్థలం చిత్రంతో ఘనవిజయం అందుకున్న రాంచరణ్.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దూకబోతున్నాడు. బోయపాటి స్టైల్ లో ఈ చిత్రం వచ్చే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లో బోణి కొట్టిన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్.

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది. చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











