సల్మాన్ అండతో ముంబై లో రామ్ చరణ్...
బాంద్రా: రామ్‌చరణ్ ముంబయిలో సొంత ఇంటి కోసం వెతుకుతున్నారు. వారం కిందట ముంబయికి వచ్చిన ఆయన ఈ విషయమై హిందీ హీరో సల్మాన్ ఖాన్‌ను సంప్రదించినట్లు తెలిసింది. సల్మాన్ నివాసముండే బాంద్రా పరిసరాల్లోనే ఇంటిని కొనుగోలు చేసేందుకు చరణ్ ప్రయత్నిస్తున్నారు. నగరానికి వచ్చిన ఆయనకు సల్మాన్ ఆతిథ్యం ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రముఖ బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారుల్ని కూడా పరిచయం చేశారు.
ఇక సల్మాన్ సోదరి అర్పిత జన్మదిన వేడుకకు కూడా రామ్ చరణ్ హాజరైనట్లు తెలుస్తోంది. బాంద్రా సమీపంలో మూడు ఆస్తులను చూసిన విషయం వాస్తవమేనని చరణ్ సన్నిహితులు పేర్కొన్నారు. భార్య ఉపాసనతో చర్చించి ఈ మూడింటిలో ఒకదాన్ని కొనుగోలు చేయాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. ఉపాసన కూడా ఇక్కడ అపోలో ఆస్పత్రిని విస్తరించే పనుల్లో నిమగ్నమైనట్లు తెలిసింది.
ప్రస్తుతం రామ్ చరణ్ హిందీలో జంజీర్ రీమేక్ తో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.
మరో ప్రక్క రామ్ చరణ్ తెలుగులో వివి వినాయిక్ చిత్రం నాయక్ లో నటిస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా యూనివర్సల్ మీడియా సంస్థ 'నాయక్'చిత్రాన్ని నిర్మిస్తోంది. కాజల్, అమలాపాల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రాన్ని జనవరి 12,2013 న అంటే సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాత మీడియాకు తెలియచేసారు.


Click it and Unblock the Notifications











