'కన్నె స్వామి' గా రామ్ చరణ్ ఫస్ట్ లుక్
రామ్ చరణ్ రీసెంట్ గా అయ్యప్ప మాల వేసుకున్న సంగతి తెలిసిందే. తన తండ్రి చిరంజీవి రూట్లోనే అయ్యప్ప దీక్ష తీసుకున్న ఆయన 41 రోజుల మండల దీక్షలో ఉన్నారు.కన్నె స్వామి గానే ఆయన నల్ల డ్రస్ వేసుకుని ఆయన సిఎమ్ పోలో ఫైనల్ ఈవెంట్ కి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఎంగేజ్ మెంట్ కు ముందే శబర్ మలై కి వెళ్లటానికి రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి చిరంజీవిలా అయ్యప్పమాల వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. నిన్న గురువారం నాడు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్య సాయి నిగగామగం లో రామ్ చరణ్ ఈ మాల వేయించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.


Click it and Unblock the Notifications











