twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరొచ్చినా!.. చెర్రీ ఫస్ట్ అదే చేస్తున్నాడట, ఒరిజినల్ లక్ష్మిని మరిచిపోతాడా?

    |

    రంగస్థలం ఆడియో జనాల నోళ్లలో బాగా నానుతోంది. ఎక్కడా చూసినా.. విన్నా.. ఇటీవల ఆ పాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను మెప్పించేలా ఉన్న ఆడియో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆడియో ఇంతలా హిట్టవడంతో రాంచరణ్ కూడా ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడట..

    ఊర మాస్ రంగస్థలానికి, మెగాస్టార్ సినిమాకు లింకేంటి?: చిరంజీవి నిజంగా అలా అన్నారా?ఊర మాస్ రంగస్థలానికి, మెగాస్టార్ సినిమాకు లింకేంటి?: చిరంజీవి నిజంగా అలా అన్నారా?

    Recommended Video

    వివాదంలో రంగస్థలం రంగమ్మ మంగమ్మ సాంగ్
    చంద్రబోస్ స్పందన..:

    చంద్రబోస్ స్పందన..:

    రంగస్థలం ఆడియో సూపర్ హిట్ అవడంతో గీత రచయిత చంద్రబోస్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలోని పాటల్లో కొన్నింటిని కేవలం 45నిమిషాల వ్యవధిలోనే రాశానని చెప్పుకొచ్చారు.

    దర్శకుడు సుకుమార్‌తో చర్చిస్తూ.. అప్పటికప్పుడు కొన్ని లిరిక్స్ అల్లుకుపోయానని, ఆ వెంటనే వాట్సాప్ ద్వారా దేవిశ్రీకి పంపిస్తే.. క్షణాల్లో ట్యూన్ చేసి పంపించాడని చెప్పుకొచ్చారు. మరోసారి గుర్తుండిపోయే పాటలు రాశానని సంతోషం వ్యక్తం చేశారు.

     ఎవరొచ్చినా వినిపిస్తున్నాడట..:

    ఎవరొచ్చినా వినిపిస్తున్నాడట..:

    ఇక హీరో రాంచరణ్ అయితే.. తన వద్దకు ఎవరొచ్చినా.. ముందు రంగస్థలం పాటలే వినిపిస్తున్నాట. అద్భుతమైన పాటలు ఇచ్చారంటూ చంద్రబోస్ ను ఆకాశానికెత్తేస్తున్నారట.

    రాంచరణ్ సంతోషం.. అభిమానుల నుంచి వస్తున్న స్పందన చూసి చంద్రబోస్ సైతం కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు.
    దాదాపు సుకుమార్ సినిమాలన్నింటికీ పాటలు రాస్తూ వచ్చిన చంద్రబోస్.. ఈ సినిమాతో మరోసారి తమ కాంబినేషన్ సూపర్ హిట్ అని నిరూపించారు.

    ఒరిజినల్ లక్ష్మిని మరిచిపోతానేమో!..:

    ఒరిజినల్ లక్ష్మిని మరిచిపోతానేమో!..:

    ఇక రాంచరణ్ ఇటీవల ఓ కంపెనీ ఈవెంట్ కు హాజరవగా.. అక్కడ కూడా రంగస్థలం పాటలే మోత మోగాయట. ఈ సందర్భంగా అక్కడ డ్యాన్స్, సింగింగ్ కాంపిటీషన్ నిర్వహించారట. వాళ్ల పాటలు, డ్యాన్సులు చూసి తెగ సంబరడిపోయిన చెర్రీ.. అచ్చు సినిమాలో వేసిన స్టెప్పులు వేశారని మెచ్చుకున్నారట.

    అంతేకాదు, పాటలు పాడినవారు సైతం ఒరిజినల్ కు ఏమాత్రం తీసిపోకుండా పాడారని, ఇదంతా చూస్తుంటే తాను ఒరిజినల్ లక్ష్మిని(రంగస్థలంలో సమంత)ను మరిచిపోయేలా ఉన్నానని నవ్వులు పూయించారట.

    రంగస్థలం.. నా కెరీర్ బెస్ట్:

    రంగస్థలం.. నా కెరీర్ బెస్ట్:

    ఈ సినిమా కోసం తాను 365 రోజులు వెచ్చించానని చెప్పాడు చెర్రీ. తన కెరీర్ మొత్తంలో ఇంత సుదీర్ఘ కాలం పనిచేసింది ఈ సినిమాకు మాత్రమేనని చెప్పాడు. రంగస్థలం కచ్చితంగా కెరీర్ బెస్ట్‌గా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్ని సినిమాలో ఉన్నాయన్నారు.

     ఐ మిస్ మై బియర్డ్:

    ఐ మిస్ మై బియర్డ్:

    సినిమా కోసం దాదాపు సంవత్సరం నుంచి గెడ్డంతోనే ఉన్నానని, రెండు రోజుల క్రితమే తీసేశానని చెప్పుకొచ్చాడు. గెడ్డం తీసినందుకు బాధపడుతూ.. ఐ మిస్ మై బియర్డ్ అని సరదా కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా స్వచ్చంద కార్యక్రమాల గురించి కూడా ప్రస్తావించాడు చెర్రీ. రక్త దానం, ఆర్థిక సహాయం విషయంలో ఉదారంగా ఉండాలని చెప్పాడు.

    English summary
    Hero Ramcharan enjoying the mood of Rangasthalam, especially super hit auido of the movie. Cherry sharing his excitement with his dearest ones
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X