»   » రాజమౌళి బాక్సింగ్ కథ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన రాంచరణ్!

రాజమౌళి బాక్సింగ్ కథ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన రాంచరణ్!

Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. తదుపరి చిత్రంలో కూడా రాంచరణ్ దానయ్య నిర్మాణంలోనే నటించనున్నాడు. ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి భారీ మల్టీ స్టారర్ చిత్రానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని కూడా డివివి దానయ్య నిర్మించాబోతున్నారు. దాదాపు ౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రం గురించి వార్తలు ప్రారంభమైనప్పటి నుంచి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ నాలుగవసారి, రాంచరణ్ రెండవ సారి దర్శక ధీరుడి దర్శకత్వంలో నటించబోతున్నారు.

Ramcharan gives clarity on Rajamouli movie.

బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కించబోతున్న చిత్రం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్ దీని గురించి స్పందించాడు. అంతా అనుకుంటున్నట్లు ఇది బాక్సింగ్ కథ కాదని చెర్రి తెలిపాడు. వేరే అంశం గురించి ఈ చిత్రం తెరకేక్కబోతోందని తెలిపాడు. ఎన్టీఆర్ నటిస్తున్న త్రివిక్రమ్ చిత్రం, రాంచరణ్ నటిస్తున్న బోయపాటి చిత్రం పూర్తయ్యాక రాజమౌళి చిత్రం పట్టాలేక్కబోతోంది.

English summary
Ramcharan gives clarity on Rajamouli movie. Stori is not releated to boxing he says
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X