రామ్ చరణ్ అంత అమాయకుడేం కాదు
రామ్ చరణ్ మీరనుకున్నంత అమాయకుడేం కాదు...అతను కేవలం ఫన్ కోసమే అలా ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు అంటున్నారు దగ్గుపాటి రానా. ఆ మధ్యన రామ్ చరణ్ తన ట్విట్టర్ లో 3 am ప్రెండ్ అంటే ఏమిటి అంటూ రానా ని అని అడుగుతూ ట్వీట్ చేసారు. ఈ విషయమై మీడియావారు రీసెంట్ గా రానాని అడిగితే ఇలా స్పందించాడు. ఆ రోజు రామోజీ ఫిలిం సిటిలో షూటింగ్ కోసం అక్కడ ఉండగా రామ్ చరణ్ షూటింగ్ కూడా ప్రక్కనే జరుగుతోంది. ఇద్దరం కలుసుకున్నాం. అప్పుడు ట్విట్టర్ లో రాసిన త్రిష..3 am ప్రెండ్ విషయం ప్రస్తావనకి వచ్చింది. అప్పుడు సరదాగా నవ్వుతూ దాని అర్దమేంటి అని నన్ను అడిగి అదే ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు అంతే అని వివరించాడు.
ఇక తన చిత్రం నా ఇష్టం గురించి చెపుతూ మార్చి 23 న ఈ చిత్రం విడుదల చేస్తామని చెప్పారు. సుకుమార్ శిష్యుడు తోలేటి ప్రకాష్ దర్శకత్వంలో 'నా ఇష్టం' చిత్రం రూపొందింది. చక్రీ సంగీతం అందించే ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీ.


Click it and Unblock the Notifications











