ఇంట్లో పూజ చేసుకుని బయలుదేరిన రాంచరణ్.. ఇక ఊచకోతే!
రంగస్థలం ఘనవిజయం తరువాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో సినిమాకు రెడీ అయిపోయాడు. నేటి నుంచి రాంచరణ్ తన కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నాడు. రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఈ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. కానీ రాంచరణ్ ఇంతవరకు షూటింగ్ లో పాల్గొనలేదు. చరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.రంగస్థలం చిత్రంలో రాంచరణ్ నటనతో అదరగొట్టాడు.

బోయపాటి మాస్ మసాలా
రంగస్థలం వంటి విభిన్నమైన చిత్రంలో నటించిన రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి రూపొందించే యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంలో పాల్గొనబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇదివరకే ప్రారంభమైనా చరణ్ మాత్రం నేటి నుంచే షూట్ లో పాల్గొనబోతున్నాడు.

రంగస్థలం తరువాత
రంగస్థలం చిత్రం తరువాత రాంచరణ్ వరుస చిత్రాలతో బిజీకాబోతున్నాడు. ప్రస్తుతం బోయపాటి చిత్రంలో నటిస్తున్న చరణ్ ఆ తరువాత రాజమౌళి చిత్రంలో నటించాల్సి ఉంది. దర్శకుడు కొరటాల కూడా రాంచరణ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంట్లో పూజ చేసుకుని
రాంచరణ్ బోయపాటి సినిమా సెట్స్ కి వెళ్లే ముందు ఇంట్లో పూజచేసుకుని బయలుదేరాడు. ఈ విషయాన్ని చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సంగతి తెలిసిందే. రాంచరణ్ కు సంబందించిన ప్రతి విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు.

బోయపాటి మార్క్‌తో
ఈ చిత్రం బోయపాటి యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోతోంది. రాంచరణ్ పాత్రకు ధీటుగా బోయపాటి ఈ చిత్రంలో విలన్ పాత్ర ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఫైట్స్ అదిరిపోయేలా ఉండనున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ స్నేహ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











