1,15,060 కట్టి మరీ రామ్ చరణ్...

By Srikanya

హైదరాబాద్: స్టార్ హీరో రామ్ చరణ్...కోటి ..14 లక్షలు విలువైన తన ల్యాండ్ క్రూజర్ వాహనం కు టీఎస్ 09ఈఈ 1111 నంబర్ ని ఫ్యాన్సీ గా తీసుకున్నారు. అందుకోసం ఆయన 1,15,060 రూపాయలు మొత్తం వేలం పాటలో ఆర్టీఏ ఆఫీసుకు చెల్లించారు. ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులకు ఉన్న క్రేజ్ తో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ వేలం పాటలో పలు నెంబర్లు లక్షలు కురిపించాయి. ఈ వేలం పాటలో 8,39,224 ఆదాయం లభించినట్లు ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్ తెలిపారు.

రామ్ చరణ్ తాజా చిత్రం విశేషాలకు వస్తే...

రామ్ చరణ్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అయినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్లు కాకుండా...తమిళ కుర్రోడు, కొలవెరి సాంగ్ ఫేం అనిరుద్ రవిచందర్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన వై దిస్ కొలవెరి సాంగ్ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. మరి రామ్ చరణ్ సినిమాకు అనిరుద్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Ramcharan Just Paid Rs.1,15,060 Lakhs To Telangana !'

ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ ఖరారు చేసారు. సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. సినిమాకు సంబంధించిన పేపర్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉందని, త్వరలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

దూకుడు సినిమా తర్వాత విడిపోయి శ్రీను వైట్ల-కోన వెంకట్-గోపీ మోహన్... రామ్ చరణ్ సినిమా కోసం మళ్లీ కలిసి పని చేస్తుండటం గమనార్హం. ఈ విషయమై గోపీ మోహన్ మాట్లాడుతూ...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శ్రీనువైట్ల డైరెక్షన్లో దానయ్య గారి బ్యానర్ లో త్వరలో స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ కి కూడా మేము కధని అందిస్తున్నాం. పదేళ్ళు కలిసి పనిచేసిన మేము(వైట్ల గారు,కోన గారు,నేను), కొన్ని అనివార్య కారణాల వల్ల గత సంవత్సరం కలిసి పనిచెయ్యలేకపోయాం. దానికి కారణాలు అనేకం.

జరిగిన దానికి ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించుకునే సంస్కృతి నుండి బయటపడి, అందరి హీరోలతో జనరంజకమైన సినిమాలకి పనిచెయ్యాలని ఆశిస్తున్నాము. హీరో రామ్ చరణ్ ఉన్నత మనసుతో కోన గారిని, వైట్ల గారిని కలిపిన విధానం అభినందించదగినది. మా కలయికలో రాబోయే రామ్ చరణ్, సమంతల నూతన చిత్రం చాలా మంచి కధతో, శ్రీను వైట్ల గారి సినిమాలకి భిన్నమైన కొత్త కధనంతో రూపకల్పన జరుగుతోంది.

మా మార్కు మంచి హాస్యము ఉంటుంది. శ్రీను వైట్ల గారు, మా కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం గారి పాత్ర ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ఇదివరకు సినిమాల ఛాయలు ఎక్కడా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X