మగధీర రిలీజ్ డేట్ ఇదే!

ఇక మగధీర చిత్రం షూటింగ్ వర్కింగ్ డేస్ 220 రోజులని సమాచారం. అయితే సంవత్సరాలు తరబడి షూటింగ్ జరుపుకున్న చిత్రాలు ఉన్నాయి గానీ..పక్కా ప్లానింగ్ తో వెళ్ళే రాజమౌళి ఇన్ని రోజులు షూటింగ్ చేయటం అనేది ఆశ్చర్యమేనంటున్నారు. రాజమౌళి గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు దేనికీ ఇంతకాలం కాలేదని, అలాగే రోజులకు తగ్గట్లే భారీ బడ్జెట్ అయిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. సినిమా మెగా హిట్టయితే గానీ ఆ డబ్బులు రికవరి అవటం కష్టం..అయినా ఆ రేంజి కెపాసిటి ఆ చిత్రంలో ఉండే ఉంటుంది...లేకపోతే చెయ్యరు అంటున్నారు విశ్లేషకులు. ఇక పునర్జన్మల చుట్టూ తిరిగే ఈ చిత్రం మూడు భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ అనంతరం రిలీజ్ అయ్యే ఈ సినిమా రీరికార్డింగ్ నిమిత్తం ప్రస్తుతం ఫిలిం సిటీలో ఉంది. అలాగే 220 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అన్ని రోజులూ ఆడాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











