»   » రాంచరణ్‌కు ఈ విద్య కూడా తెలుసా.. నిహారిక కోసం.. అందిరిపోయింది!

రాంచరణ్‌కు ఈ విద్య కూడా తెలుసా.. నిహారిక కోసం.. అందిరిపోయింది!

Subscribe to Filmibeat Telugu
రాంచరణ్‌కు ఈ విద్య కూడా తెలుసా.. నిహారిక కోసం.. అందిరిపోయింది!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన చిత్రాలతో, నటనతో అభిమానులని అలరిస్తున్నాడు. నటనలో మాత్రమే కాదు.. రాంచరణ్ కు ప్రత్యకంగా తెలిసిన విద్యలు చాలా ఉన్నాయి. రాంచరణ్ గుర్రపు స్వారీ, డాన్సుల పరంగా ప్రత్యకంగా శిక్షణ తీసుకున్నాడు. చాలా తక్కువ మంది మగరాయుళ్లకు తెలిసిన మరో విద్య కూడా చెర్రీకి తెలుసు. అదే వంట వండడం. సాధారణంగా వంట గదికి మగవాళ్ళు దూరంగా ఉంటారు. వంటలు అదిరిపోయేలా చేయడంలో చరణ్ దిట్ట అని ఈ మధ్యనే తెలిసింది. రాంచరణ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సతీమణి కోసం ప్రత్యేకంగా

సతీమణి కోసం ప్రత్యేకంగా

ఆ మధ్య తన సతీమణి ఉపాసన కోసం రాంచరణ్ స్పెషల్ గా బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఉపాసన ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. రాంచరణ్ వంట గదిలో గరిట పట్టుకుని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు చెల్లెలి కోసం

తాజగా రాంచరణ్ వంట గదిలో చేపల పులుసు వండుతున్న వీడియో వైరల్ అయింది. ఈ వీడియో రాంచరణ్ సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఇది తాను స్వయంగా చేసిన చేపల కూర అని, నిహారిక కోసం చేసానని రాంచరణ్ అంటున్నాడు.

అదిరిపోయిందట

అదిరిపోయిందట

చేపకూర వండాక ఎలా ఉందొ తెలుసు కోవడానికి రాంచరణ్ కొద్దిగా రుచి చూశాడు. రుచి చూసిన వెంటనే అదిరిపోయింది అంటూ రియాక్షన్ ఇచ్చాడు. దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు చెర్రీ ఎంత చక్కగా వంటలు వండగలడో.

 వైరల్ అయిన వీడియో

వైరల్ అయిన వీడియో

ఈ వీడియో ఎప్పటిదో తెలియదు కానీ మెగా అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి సినిమా కోసం బ్యాంకాక్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నెల 25 వరకు అక్కడ షూటింగ్ జరగనుంది.

English summary
RamCharan makes Fish curry for Niharika. Video goes viral
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X