'రచ్చ'ఆడియో విడుదలపై నిర్మాత
రామ్ చరణ్ తేజ తాజా చిత్రం 'రచ్చ'ఆడియో కర్నాలులో అవుతుందని,లేదు సెక్యూరిటీ కారణాల వల్ల హైదరాబాద్ లోనే జరుగుతుందని ఇలా రకరకాల వార్తలు గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్నాయి. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ 'రచ్చ'నిర్మాతలు ఆఫీషియల్ గా ఆడియో గురించి మీడియాకు తెలియచేసారు. ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 11న హైదరాబాద్‌లో విడుదల చేస్తామనన్నారు. నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, పారాస్‌జైన్ మాట్లాడుతూ...మణిశర్మ అందించిన బాణీలన్నీ బాగున్నాయి. అభిమానులకే కాదు, అందరికీ తప్పకుండా నచ్చుతాయి. ముఖ్యంగా 'గ్యాంగ్ లీడర్'లో 'వానా వానా వెల్లువాయె' పాట రీమిక్స్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది. చరణ్ స్టెప్పులు కొత్త తరహాలో తీర్చిదిద్దాం. త్వరలోనే సినిమా విడుదల వెన్యూ ప్రకటిస్తామని అన్నారు. ఇక రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రచ్చ'. తమన్నా నాయిక. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. సమర్పణ: ఆర్.బి.చౌదరి.


Click it and Unblock the Notifications











