రామ్ చరణ్ తేజ్ ‘మెగా’ ప్లాన్స్
మెగా తనయుడిగా గుర్తింపు ఉండటంతో కేవలం రెండు మూడు సినిమాలతోనే ఓ రేంజ్ కి ఎదిగి పోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ.....కెరియర్ విషయంలో తనదైన రీతిలో ముందుకు సాగుతున్నాడు. చరణ్ కంటే ముందు కెరియర్ ప్రారంభించిన టాలీవుడ్ హీరోలంతా కేవలం తెలుగు మార్కెట్ తోనే సరిపెట్టుకుంటే.....నిన్నగాక మొన్నవచ్చిన రామ్ చరణ్ మాత్రం తన మార్కెట్ ను దశదిశలా విస్తరించుకునే ప్రయత్నంలో తలమునకలై ఉన్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మళయాళం, కర్నాటకలోనూ ఒకే సారి విడుదల చేసేందుకు భారీ ప్రణాళికలే తయారు చేస్తున్నాడు చెర్రీ. మెగా తనయుడిగా తన ఫేసు అందరికీ సుపరిచితమే కాబట్టి...సినిమా ద్వారా వారిని మెప్పించ గలిగితే, త్వరిత గతిన ఓ రేంజ్ కు ఎదిగి పోవచ్చనేది చెర్రీ ప్లాన్ గా కనిపిస్తోంది. సౌతిండియా సినిమాపై పట్టు సాధిస్తే చరణ్ తన తండ్రి స్థాయికి అతిత్వరలోనే ఎదగడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
రచ్చ సినిమా చేస్తూనే...రామ్ చరణ్ వివివినాయక్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో 2 సినిమాలకు కమిటయ్యాడు. వినాయక్ సినిమాలో చెర్రీ డబుల్ రోల్ లో దర్శనం ఇవ్వ బోతున్నాడు. వంశీ పైడిపల్లితో చేస్తున్న చిత్రానికి 'ఎవడు' అనే టైటిల్ ఖరారు చేశారు.


Click it and Unblock the Notifications











