రాత్రంతా నా భార్య నిద్రపోలేదు.. 'అనుష్క'కు థ్యాంక్స్: రాంచరణ్
Recommended Video

ఒక హీరో సినిమాను మరో హీరో అభినందించడం.. ఇతర హీరోల సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకోవడం.. ఇండస్ట్రీలో ఆరోగ్యకర పోటీకి సంకేతం. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆరోగ్యకర వాతావరణమే కనిపిస్తోంది. పెద్ద హీరోలు సైతం వేరే హీరోల సినిమాలపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. తాజాగా హీరో రాంచరణ్ అనుష్క 'భాగమతి'పై స్పందించడం విశేషం.

'అనుష్క'.. మైండ్ బ్లోయింగ్..:
'రాత్రి 'భాగమతి' సినిమా చూశాను. అనుష్క నటన మైండ్ బ్లోయింగ్. టెక్నికల్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. టీమ్ అంతా చాలా కష్టపడింది. వారందరికీ శుభాకాంక్షలు.' అని చెర్రీ ట్వీట్ చేశారు.

నా భార్య నిద్రపోలేదు:
సినిమా చూశాక తన భార్య ఉపాసన రాత్రంతా నిద్రపోలేదని.. అందుకు 'భాగమతి'కి థ్యాంక్స్ అంటూ చెర్రీ ఓ సరదా ట్వీట్ చేశారు. బహుశా 'భాగమతి' నిద్రలోనూ ఆమెను వెంటాడి ఉంటుంది.

ఫన్నీ రిప్లై:
తన భార్య రాత్రంతా నిద్రపోలేదని చెర్రీ చేసిన సరదా కామెంట్ కు అంతే సరదాగా ఆ చిత్ర యూనిట్ కూడా స్పందించింది. 'జనాలను నిద్రపోనివ్వకూడదనే మా లక్ష్యం నెరవేరింది. రాంచరణ్ గారు థ్యాంక్స్.. మా కష్టాన్ని గుర్తించినందుకు' అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.

మంచి ఓపెనింగ్స్:
సాధారణంగా స్టార్ డమ్ ఉన్న హీరోలకు మాత్రమే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. లేడి ఓరియెంటెడ్ సినిమాలకు ఓపెనింగ్స్ అంతంత మాత్రమే అన్న టాక్ ఉంది.
అయితే అనుష్క లాంటి హీరోయిన్ ప్రధాన పాత్రలో నటిస్తే మాత్రం.. పెద్ద హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కలెక్షన్స్ ఉంటాయి. తాజా చిత్రం 'భాగమతి' మరోసారి దాన్ని నిరూపించింది. ఫస్ట్ డే దాదాపు రూ.8కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసినట్లు టాక్.

అంచనాలను అందుకుంది:
అరుంధతి , రుద్రమదేవి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో టాప్ హీరోలతో పోటీగా మార్కెట్ ఏర్పరుచుకున్నారు అనుష్క. దీంతో 'భాగమతి'పై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తర్వాత అభిమానుల స్పందన చూస్తుంటే.. 'భాగమతి' అంచనాల్ని అందుకుందనే చెప్పాలి. ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే ఎలిమెంట్స్ సినిమాలో చాలానే ఉన్నాయంటున్నారు.

వీకెండ్ కలెక్షన్స్:
గత వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో 'భాగమతి' 12 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్‌లో కలెక్షన్స్ ఇంకా నిలకడగానే ఉన్నట్లు టాక్. గతంలో పిల్ల జమీందారు, సుకుమారుడు వంటి క్లాస్ చిత్రాలు తీసిన దర్శకుడు జి.అశోక్.. 'భాగమతి'తో ఆ ఇమేజ్ నుంచి బయటపడ్డారు. ఎలాంటి సబ్జెక్ట్ అయినా తాను డీల్ చేయగలనని నిరూపించుకున్నారు.


Click it and Unblock the Notifications











