ఫోటోలు: భరత్ అసెంబ్లీలో రాంచరణ్, మహేష్ ముద్దుల కూతురు సితార!
భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ముఖ్యమంత్రిగా మహేష్ నటన, అద్భుతంగా పేలిన డైలాగులు అభిమానులని పెచ్చెక్కిస్తున్నాయి. భరత్ అనే నేను చిత్రం కళ్ళు చెదిరే కలెక్షన్లతో దూసుకుపోతుంటే, అంతే స్థాయిలో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.

కొరటాల, మహేష్ సూపర్ హిట్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కింది. శనివారం రోజు చిత్రయూని వైభవంగా భరత్ బ్లాక్ బాస్టర్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

భరత్ అనే నేను చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో పలువురు సెలెబ్రిటీలు సెట్స్ ని సందర్శించారు. రాంచరణ్, సుకుమార్ భరత్ అనే నేను అసెంబ్లీ సెట్ ని సందర్శించిన దృశ్యాల్ని చిత్ర యూనిట్ తాజగా విడుదల చేసింది. రాంచరణ్ రంగస్థలం చిత్ర సెట్ ని కూడా మహేష్ సందర్శించిన సంగతి తెలిసిందే.

భరత్ అసెంబ్లీ సెట్ లోకి మహేష్ గారాలపట్టి సీతారాకు కూడా దూరేసి సందడి చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మహేష్ సతీమణి నమ్రత తన ఇద్దరు పిల్లలతో భరత్ అసెంబ్లీని సందర్శించారు.


Click it and Unblock the Notifications











