కళ్యాణ్ బాబాయ్‌కి 24 గంటల్లో సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్ వెయిట్ చేయండి.. రాంచరణ్!

Recommended Video

Ramcharan Special Planning For Pawan Kalyan Birthday

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రేపు ఘనంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హంగామా మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం పవన్ పుట్టిన రోజుని అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ హంగామా ఇంకాస్త ఎక్కువగా ఉండనుంది. ఇదిలా ఉండగా మెగా అభిమానులు ఖుషి అయ్యేలా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజగా ప్రకటన చేశాడు.

24 గంటల్లో సర్‌ప్రైజ్

24 గంటల్లో సర్‌ప్రైజ్

పవన్ కళ్యాణ్ పుట్టిరోజు సందర్భంగా ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉందని రాంచరణ్ ప్రకటించాడు. కళ్యాణ్ బాబాయ్ రేపు నీకో సర్ ప్రైజ్ ఉంది అంటూ రాంచరణ్ పేర్కొన్న వీడియోని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

స్పెషల్ వీడియో

కళ్యాణ్ బాబాయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన వీడియో ఒకటి రూపొందించాం. 24 గంటలలోపు విడుదల చేస్తాం.. వెయిట్ చేయండి అంటూ చరణ్ తెలిపాడు. చరణ్ ప్రకటనతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.

బోయపాటి సినిమా

బోయపాటి సినిమా

రాంచరణ్ విడుదల చేయబోయే వీడియో దీనిగురించి అంటూ ఫాన్స్ లో చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బోయపాటి సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయాలనీ ఫాన్స్ చాలా రోజులుగా చరణ్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఫస్ట్ లుక్ విడుదల ఆలస్యం కానుండడంతో బాబాయ్ పుట్టినరోజుని చరణ్ ఈ విధంగా ప్లాన్ చేశాడు.

పవన్ స్వయంగా

పవన్ స్వయంగా


ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కుటుంబ సమేతంగా వెళ్లి అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. మెగా బ్రదర్స్, బాబాయ్ అబ్బాయ్ మధ్య బంధం చూసి ఫాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X