twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రచ్చ’ఆడియోలో రామ్ చరణ్ ఉద్వేగ ప్రసంగం

    By Srikanya
    |

    ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'రచ్చ' ఆడియో వేడుకలో రామ్ చరణ్ చాలా ఉద్వేగంగా ప్రసంగించారు. ఆరెంజ్ ప్లాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నట్లు ఆ మాటల్లో వ్యక్తమైంది. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ '' సంపత్‌ ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడు. తనలోని స్పష్టత నాకు చాలా నచ్చింది. తెరపై సినిమా చూస్తున్నట్టుగా కథ చెప్పాడు. అందుకే ఈ సినిమా ఒప్పుకొన్నా. మణిశర్మని మెలోడీ బ్రహ్మ అంటారు. ఈ సినిమాతో మాస్‌ బ్రహ్మ అనిపించుకొంటాడు. ఎముకలు విరిగిపోయేలా ఆయన పాటలకు డాన్స్‌ చేయాల్సి వచ్చింది. ఇప్పటిదాకా నాతో నటించిన హీరోయిన్స్ ల్లో తమన్నా నాకు ఎంతో నచ్చింది. ఈ సినిమాకోసం ఎంతో కష్టపడింది. తన బాబాయ్ పవన్‌కళ్యాణ్‌కు సుస్వాగతం, అన్నవరం వంటి హిట్స్ ఇచ్చిన సూపర్ గుడ్ సంస్థ తనతో 'రచ్చ' చేయడం ఆనందంగా ఉందన్నారు. అభిమానులు బాబాయ్‌ గురించి అడుగుతున్నారు. ఈ వేడుకని 4వతేదీనే చేద్దామనుకొన్నాం. కానీ కుదరలేదు. దీంతో షూటింగ్‌ నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ రోజు సాయంత్రమే ఫోన్‌చేసి అభినందనలు చెప్పారు ''అన్నారు.

    తను మొదటి సినిమా చేసినంత ఆనందంగా ఇప్పుడు మనసులో కలుగుతోందని తమన్నా చెప్పారు. దర్శకుడు వివి వినాయిక్ మాట్లాడుతూ.. ''చిరంజీవికి 'గ్యాంగ్‌లీడర్‌' తరహాలో చరణ్‌కి ఈ చిత్రం గుర్తింపును తెచ్చిపెడుతుందని''అన్నారు ‌. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం మలయాళం భాషల్లో విడుదల చేస్తామన్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌, నాగబాబు, ఆర్‌.బి.చౌదరి, అల్లు అరవింద్‌, తమన్నా, వంశీపైడిపల్లి, పరుచూరి బ్రదర్స్‌, అశ్వనీదత్‌, దిల్‌రాజు, డి.వి.వి.దానయ్య, గంటా శ్రీనివాసరావు, బాలీవుడ్‌ ప్రముఖులు అపూర్వ లఖియా, అమిత్‌ మెహ్రా తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

    English summary
    Ram charan says Rachcha audio is for Mass.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X