బాబాయ్ కి రాంచరణ్ సపోర్ట్.. ఎలక్షన్ సాంగ్ అదిరింది!

Recommended Video

పవన్ ప్రసంగం పై చరణ్ సంచలన కామెంట్స్

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం మార్చ్ 30 న విడుదలకు సిద్ధం అవుతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేసింది. కాగా రంగస్థలం చిత్రం రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆది పినిశెట్టి చరణ్ కు సోదరుడిగా నటిస్తున్నాడు. చిత్రంలో ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఓ పాటని రూపొందించారు. ఇటీవల రంగస్థలం చిత్ర జ్యూక్ బాక్స్ విడుదలైంది. అన్ని పాటలు అలరిస్తున్నాయి.

రంగస్థలంలో ఆ పాట

రంగస్థలంలో ఆ పాట

రాజకీయ నేపథ్యంలో రంగస్థలం చిత్రం రూపొందుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం ఓ పాటని రూపొందించారు రూపొందించారు. ఆగట్టునుంటావా నాగన్న ఈ గట్టు కోస్తావా అని సాగె ఈ పాట.. అవినీతి నాయకులకు,నిజాయతి కలిగిన నాయకులకు మధ్య వ్యత్యాసం చూపే విధంగా హుషారురేకెత్తించే విధంగా ఉంది.

 బాబాయ్ పై చరణ్ ప్రేమ

బాబాయ్ పై చరణ్ ప్రేమ

రాజకీయాలని పక్కన పెడితే చిరంజీవి, పవన్ ఎంతటి ప్రేమ ఉందొ మాటల్లో చెప్పలేనిది. అంతకు మించే విధంగా బాబాయ్ అంటే చరణ్ ప్రేమ చూపిస్తాడు.

 స్పీచ్ అదిరింది

స్పీచ్ అదిరింది

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ సభలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. పవన్ ప్రసంగాన్ని రాంచరణ్ అభినందించాడు. ఆదర్శవంతమైన ప్రసంగం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం విశేషం.

 మార్చ్ 30 కోసం ఎదురుచూపులు

మార్చ్ 30 కోసం ఎదురుచూపులు

ఇదిలా ఉండగా రంగస్థలం చిత్రం అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుని మార్చ్ 30 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. త్వరలో నిర్వహించే ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X