మేం సిగ్గుపడే సినిమా: రామ్ చరణ్

By Srikanya

"మా తరం హీరోలు సిగ్గుపడేట్టుంటుంది ఈ సినిమా. యాక్టర్అంటే సూర్యలాగా ఉండాలి. ఈ పాత్రకు సూర్య తప్ప ఎవరూ న్యాయం చేయలేరు. మగధీర సూర్య చేయవలసిన సినిమా. మురుగదాస్‌తో పనిచేయాలని కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది'' అని రామ్‌చరణ్ అన్నారు.మురుగదాస్, సూర్య కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'సెవెన్త్ సెన్స్'. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని రామ్‌చరణ్ విడుదల చేసి హీరో కార్తికి అందజేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఇలా స్పందించారు. ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ..."దక్షిణాది చిత్రాలకోసం ఉత్తరాది వారు ఎదురుచూసే ట్రెండ్‌ను మురుగదాస్ క్రియేట్ చేశారు. సిక్స్ ప్యాక్‌ను ఇంకా సూర్య కొనసాగిస్తున్నారంటే మామూలు విషయం కాదు. సూర్య, కార్తి దక్షిణాదిన హవా చూపిస్తున్నారు'' అంటారు. సూర్య, శృతిహాసన్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'ఏళామ్ అరివు"ని తెలుగులో 'సెవెన్త్ సెన్స్" పేరిట లక్ష్మీగణపతి ఫిలింస్ సుబ్రహ్మణ్యం విడుదల చేస్తున్నారు. ఈ ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ఎస్.ఎస్. రాజమౌళి, వీవీ వినాయక్ పై విధంగా స్పందించారు. చిత్రసంగీత దర్శకుడు హారీస్ జైరాజ్ మాట్లాడుతూ - 'ఇది చాలా ప్రెస్టీజియస్ సినిమా. 'గజిని" రికార్డులను బ్రేక్ చేస్తుంది"" అన్నారు. సూర్య మాట్లాడుతూ - ''గజినికన్నా ఐదారు రెట్లు ఈ చిత్రం బాగుంటుంది"" అన్నారు. ''ఈ సినిమా కోసం అన్నయ్య ఏడాది కష్టపడ్డాడు. ఇంత కష్టం అవసరమా? అంటే ప్రేక్షకుల కోసం తప్పదన్నాడు"" అన్నారు. ఒక మంచి ప్రయత్నం చేశామని మురుగదాస్ చెప్పారు. ఇంకా ఈ వేడుకలో అల్లు అరవింద్, 'ఠాగూర్" మధు, ఎన్వీ ప్రసాద్, అంబికా కృష్ణ, శర్వానంద్, శృతిహాసన్, సుబ్రమణ్యం, భువనచంద్ర, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీని రామ్‌చరణ్ ఆవిష్కరించి కార్తీకి ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X