twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్షణమొక యుగంలా గడిచిన రోజది....రామ్ చరణ్ తేజ్

    By Srikanya
    |

    నేనేమో క్షణమొక యుగంలా ధియేటర్‌ బయట పచార్లు చేస్తూ టెన్షన్‌ పడుతున్నాను. రెండున్నర గంటలు.. రెండున్నర యుగాలుగా గడిచి సినిమా పూర్తయింది. ముందుగా నాన్నే బయటకు వచ్చారు.రెండొందలకు పైగా కేంద్రాలలో 'మగధీర" వంద రోజులు పూర్తి చేసుకుని పలు కేంద్రాలలో ఇప్పటికీ విజయదుందుభి మ్రోగిస్తూ మరికొన్ని రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకుపోతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని తన మనోభావాలను రామ్‌చరణ్‌తేజ్‌ ఈవిధంగా మీడియా వద్ద పంచుకున్నారు. ఈ సందర్భంగా అన్న మాటలవి.

    'మగధీర" రేపు విడుదలవుతుందనగా నాన్నతోపాటు మా ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా సినిమా చూస్తున్నారు. నేనేమో క్షణమొక యుగంలా ధియేటర్‌ బయట పచార్లు చేస్తూ టెన్షన్‌ పడుతున్నాను. రెండున్నర గంటలు.. రెండున్నర యుగాలుగా గడిచి సినిమా పూర్తయింది. ముందుగా నాన్నే బయటకు వచ్చారు. రావడం రావడం ఒక్క అంగలో నా దగ్గరకొచ్చి నన్ను కౌగిలించుకున్నారు. ఆ కౌగిలి ఎంత గట్టిగా ఉందంటె.. ఒకటి రెండు నిమిషాలు నేను ఊపిరి కూడా తీసుకోలేకపోయాను. వేల వాక్యాల్లో చెప్పలేని భావాన్ని ఓ ఫోటో చెప్పగలిగినట్లుగా.. వేల మాటల్లో వ్యక్తం చేయలేని ఆనందం ఆ ఆలింగనం ద్వారా నాకు అవగతమైంది.

    అంతేకాదు, 'మగధీర" సాధించబోయే మహా విజయాన్ని నేను ఆ ఆలింగనంతోనే అంచనా వేయగలిగాను. ఆ ఆనందాలింగనాన్ని నేను జీవితాంతం మర్చిపోను.ప్రజారాజ్యం పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోవడంతో మా కుటుంబ సభ్యుల్లో అప్పటికి నెలకుని ఉన్న స్తబ్థతను 'మగధీర" దూరం చేసింది. ఆ చిత్రం సాధించిన అసాధారణ విజయం మా అందరిలో మనోస్థైర్యాన్ని నింపింది"" అంటున్నారు రామ్‌చరణ్‌తేజ్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X