రామ్‌చరణ్ ఎంట్రీకి అంతా రెడీ
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ తెరంగేట్రానికి సంబంధించిన సస్పెన్స్‌కు తెరపడింది. ఎప్పుడెప్పుడూ అంటూ చాలాకాలంగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ అభిమానులకు ఇది శుభవార్తే.
ఎంతోమంది యువ హీరోలను పరిచయం చేసిన వైజయంతీ మూవీస్ సంస్థ రామ్‌చరణ్ తేజ హీరోగా నిర్మించే చిత్రం డిసెంబర్‌లో ప్రారంభం కావచ్చని సంస్థ అధినేత సి. అశ్వినీదత్ ప్రకటించారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించబోతున్నారు.
ప్రస్తుతం జగన్ అల్లు అర్జున్ హీరోగా దేశముదురు చిత్రం షూటింగ్ కార్యకలాపాలలో బిజీగా ఉన్నారు. దేశముదురు పూర్తయిన వెంటనే ఆయన రామ్‌చరణ్ తేజ హీరోగా పరిచయం అయ్యే ప్రాజెక్టును చేపడతారు.
మెగాస్టార్ తనయుడి తొలి చిత్రానికి దర్శకుడు ఎవరన్నది కొంతకాలంగా సస్పెన్స్‌గా నిలిచింది. కె. రాఘవేంద్రరావు మొదలు వై.వి.ఎస్. చౌదరి వరకూ అనేకమంది పేర్లను పరిశీలించిన తరువాత ఆ అవకాశం జగన్‌కు దక్కింది. పోకిరీ వంటి అల్‌టైమ్ రికార్డ్ హిట్‌ని అందించడంతో సహజంగానే జగన్‌కు ఈ అవకాశం దక్కింది.
ఇడియట్, పోకిరి, దేశముదురు వంటి తిట్లని టైటిల్స్‌గా పెట్టి సూపర్‌హిట్లు కొట్టిన జగన్, రామ్‌చరణ్ తేజ చిత్రానికి ఏ తిట్టును టైటిల్‌గా పెడతారో చూడాలి.


Click it and Unblock the Notifications