పార్టీ ప్రచారంలో రామ్ చరణ్
'ప్రజారాజ్యమిది.. ప్రజలందరిదీ'... అంటూ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ పాటపాడారు. పార్టీ కోసం అధికారికంగా రూపొందిస్తున్న పది పాటల్లో ఒక పాటను ఆయన స్వయంగా పాడారు. పీఆర్పీ కోసం పాటల రచయిత అనంత శ్రీరాం రాసిన పది పాటల్లో ఇది ఒకటి. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చరణ్ గొంతు చాలా బాగుంటుందని మణి శర్మ చెప్పటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఇక నాన్న కోసం కాకపోతే గళం విప్పే ప్రశక్తి లేదని తన తండ్రి ప్రచారానికి తోడుగా తన పాటలను పంపుతున్నానని తన శ్రేయాభిలాషులతో చరణ్ భావోద్వేగంగా చెప్పాడని వినికిడి. అయితే ఈ పాటలు క్లిక్ అయితే రానున్న కాలంలో గాయకుడు కమ్ హీరో తెలుగుకు లభిస్తాడని సీనియర్స్ అంచనాలు వేసుకుంటున్నారు. ఇక ఈ వ్యవహారమంతా ఓ స్ట్రాటజీ ప్రకారమే నని రామ్ చరణ్ కు ఇప్పుడిప్పుడే యూత్ లో పెర్గుతున్న క్రేజ్ ని కూడా క్యాష్ చేసుకోవాలనే తపనే దీనికి ఉసి గొల్పిందని కొందరు డైరక్టుగానే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా బెస్ట్ ఆఫ్ లక్ చరణ్.


Click it and Unblock the Notifications











