'మిరపకాయ్' డైరెక్టర్ తో చేయబోతున్న ఆ మెగా హీరో ఎవరు..!?
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరెక్టర్ గా పనిచేయడం దాదాపు ఖాయమైపోయింది. ఈ విషయాన్ని 'బద్రినాథ్" ఆడియో విడుదల వేడుకలో పరోక్షంగా ప్రస్తావించాడు హరీష్ శంకర్. దర్శకుడిగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వర్క్ చేసే అవకాశం ఈ ఏడాతే కలిసొస్తుందని అనుకుంటున్నాను..అంటూ హరీష్ శంకర్ స్టేట్ మెంట్ ఇచ్చాడు 'బద్రినాథ్" ఆడియో విడుదల వేడుకలో.
అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఏ హీరోతో హరీష్ శంకర్ సినిమా చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మిగిలింది. బహుశా చరణ్ తోనో, అల్లు అర్జున్ తోనో హరీష్ శంకర్ సినిమా చేస్తుండొచ్చు..అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో గుగుసలు విన్సిస్తున్నాయి. చరణ్ 'రచ్చ" సినిమాతోపాటు మరో మూడు సినిమాలకు ఏకకాలంలో కమిట్ అవుతుండడంతో, చరణ్ కన్నా, బన్నీతోనే హరీష్ శంకర్ గీతా ఆర్ట్స్ పతాకంపై సినిమా చేసే అవకాశం వుంది.
మరి చూద్దాం..'మిరపకాయ్" సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న హరీష్, 'గబ్బర్ సింగ్" తర్వాత మెగా ఫ్యామిలీలో ఏ హీరోగో వర్క్ చేయనున్నాడో...!


Click it and Unblock the Notifications











