చరణ్‌ చిత్రానికి దసరా ముహూర్తం

By Staff

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మధురక్షణం మరికొద్ది రోజుల్లోనే కార్యరూపం దాల్చబోతోంది. ప్రతిష్టాత్మకమైన వైజయంతీ మూవీస్‌ పతాకంపై సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నిర్దేశకత్వంలో - చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ తేజ చిత్రం ముహూర్తపు షాట్‌ విజయదశమి పర్వదినాన్న నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందించే బాధ్యత మణిశర్మ భుజాలపై ఉంచారని తాజా సమాచారం. పోకిరి వంటి మాస్‌ చిత్రంలో సైతం మంచి ట్యూన్స్‌ ఇచ్చి మ్యూజికల్‌ హిట్‌ చేసిన మణిశర్మనే మళ్లీ పూరీ ఎంపిక చేసుకున్నారని వినవస్తోంది.

ఇటీవల పుట్టినరోజు నాడు వేదికపై తమ కుమారుడిని నాటకీయంగా అశ్వినీదత్‌ చేతుల్లో పెట్టిన చిరంజీవి అలా ప్రకటించడానికి ముందు ఎంతో క్షుణ్ణంగా రామ్‌చరణ్‌ తేజ యాక్టింగ్‌ స్కిల్స్‌ని, బాడీ లాంగ్వేజ్‌ని అబ్జర్వ్‌ చేసి.. ఆయన సంతృప్తి చెందిన తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. రామ్‌చరణ్‌కు ఇంటి దగ్గరే డైలాగ్‌ డెలివరీలో శిక్షణ ఇప్పించారు. డాన్స్‌ మూమెంట్స్‌ విషయంలో కూడా చక్కని తర్ఫీదు ఇప్పించారు. కొన్నాళ్లు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌లో కూడా ట్రైనింగ్‌ పూర్తి చేసి వచ్చాడు తేజ. ఫైట్స్‌ విషయంలో ఇద్దరు ముగ్గురి వద్ద శిక్షణ ఇప్పించారు. పట్టాభిషేకానికి ముందు ఒక రాజకుమారుడిని ఎంత బాగా తీర్చిదిద్దాలో అంత పరిశ్రమ రామ్‌చరణ్‌ విషయంలో తీసుకున్నారని తెలుస్తోంది. మెగాస్టార్‌ తనయుడిగా అశేష అభిమానుల అంచనాలను అందుకునే బాధ్యత రామ్‌చరణ్‌పై ఉన్నంతగా మరెవరికీ ఉండకపోవచ్చు. దానికి అతడ్ని అన్ని విధాలా సన్నద్ధం చేశారని తెలుస్తోంది.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X