రామ్ చరణ్ 2వ సినిమా
మెగాస్టార్ చిరంజీవి గారాల తనయుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముద్దుల మేనల్లుడు రామ్‌చరణ తేజ మొదటి సినిమా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అప్పుడే అతని రెండో చిత్రం గురించి అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం రామ్‌చరణ్ తేజ రెండవ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తారు. ఈ చిత్రానికి వి.వి. వినాయక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. గతంలో మెగాస్టార్‌తో వినాయక్ ఠాగూర్ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్‌గా పేరున్న వినాయక్ ఎన్టీఆర్, నితిన్ వంటి కొత్తవారితో సైతం పెద్ద హిట్స్ ఇచ్చి వారి ఇమేజ్ పెరగడంలో కీలక పాత్ర వహించారు. అటువంటి దర్శకుడితో రామ్‌చరణ్ తన రెండో చిత్రం చేయడం విశేషం. ఆ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్ర కోసం ప్రముఖ నటి జయప్రదను సంప్రదించారని తెలుస్తోంది.
మెగాస్టార్ ఒకవైపు, అరవింద్ మరో వైపు ఉండగా రామ్‌చరణ్ తేజ కెరీర్ ప్లానింగ్ ఎంత పకడ్బందీగా ఉంటుందో ఊహించవచ్చు!


Click it and Unblock the Notifications











