రమేశ్ బాబు అంత్యక్రియలు పూర్తి.. భోరుమన్న కృష్ణ..అన్నీ తానైన నమ్రత.. మహేష్ వీడియో కాల్ లో!
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు.. మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు 56 సంవత్సరాల వయసులో మృతి చెందారు. దీంతో ఆయన మృతితో టాలీవుడ్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఆయన అంత్యక్రియలు ఆదివారం నాడు ముగిశాయి. ఆ వివరాలు

కాలేయ సంబంధిత వ్యాధితో
కొంతకాలంగా ఘట్టమనేని రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించే లోపే రమేష్ బాబు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో రమేష్ బాబు మృతి విషయంలో పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

కృష్ణ కన్నీరు మున్నీరు
ఆదివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరిగాయి. అభిమానుల సందర్శనార్ధం కుటుంబ సభ్యులు రమేష్ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించారు. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు అక్కడికి చేరుకొని రమేష్ బాబు భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అయితే రమేష్ తమ్ముడు సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన నేపథ్యంలో అన్న అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు. ఇక విగతజీవిగా పడి వున్న కొడుకు రమేష్ బాబు ని చూసి చలించిపోయారు సూపర్ స్టార్ కృష్ణ. కన్నీళ్లతో తన కొడుకు రమేష్ బాబుకి ఆయన నివాళులర్పించారు. నా కంటే ముందే ఈ లోకాన్ని వీడిపోయావా బాబూ..! అంటూ సూపర్ స్టార్ కృష్ణ కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక అలా ఉన్న కృష్ణ పరిస్థితిని చూసిన చూపరులు కూడా చాలా బాధ పడ్డారు.

కడసారి
ఇక సూపర్ స్టార్ మహేష్ కరోనా బారిన పడడంతో కడసారి అన్న పార్థివ దేహాన్ని చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో అన్న మరణంతో మహేష్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అన్నను కడసారి చూసుకోలేని పరిస్థితిలో ఉన్న మహేశ్ కి నమ్రత వీడియో కాల్ చేస్తూ.. మహేష్‌తో మాట్లాడుతూ.. ఆయనలో ధైర్యం నింపేరు. అంత్యక్రియల్లో మహేష్ లేని లోటును తీర్చేందుకు కూడా ప్రయత్నించారు నమ్రత. రమేష్ బాబు భార్య, పిల్లల్ని ఓదార్చుతూ.. వారికి తోడుగా ఉన్నారు.

అంత్యక్రియలు
అంత్యక్రియలుఇక అలా రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం లో నిర్వహించిన రమేష్ బాబు అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని రమేష్ బాబుకు తుది వీడ్కోలు పలికారు. . చితికి రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ నిప్పుపెట్టారు. కోవిడ్ నిబంధనలతో అతి కొద్దిమందితో రమేష్ బాబు అంత్యక్రియలు జరిగాయి.

నా స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం
ఇక రమేష్ బాబు మృతిపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "మీరు నాకు స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం... నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు, మీరు నా కోసం చేసిన ప్రతీ దానికి ధన్యవాదాలు... నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య... ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను అంటూ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











