RIP Ramesh Babu: రమేష్ బాబు ప్రముఖుల నివాళి.. చిరంజీవి అలా.. వరుణ్ తేజ్ ఇలా సంతాపం
కొంత కాలంగా వరుస మరణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా కాలేయ సంబంధింత సమస్యలతో బాధ పడుతోన్న ఆయనకు గత రాత్రి ఆరోగ్యం క్షిణించింది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించే లోపే రమేష్ బాబు తుది శ్వాసను విడిచారు.
ఆయన మరణంతో ఘట్టమనేని అభిమానులతో పాటు సినీ ప్రియులంతా విషాదంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు, సన్నిహితులు కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రమేష్ బాబు మృతిపై సెలెబ్రిటీలు చేసిన ట్వీట్లను చూద్దాం పదండి!

సోషల్ మీడియా ద్వారా సంతాపం
ప్రముఖ నటుడు, నిర్మాత రమేష్ బాబు మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆయన మరణంపై ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు. దీంతో రమేష్ బాబు పేరు ట్విట్టర్‌లో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.
రమేష్ మరణం విచారకరమన్న చిరు
రమేష్ బాబు మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'రమేష్ బాబు మరణ వార్త తెలిసి షాక్ అయ్యాను. ఆయన మృతి దిగ్బ్రాంతికరం. కృష్ణ గారికి, మహేశ్‌తో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. దీన్ని తట్టుకునే శక్తిని వాళ్లకు కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అంటూ పేర్కొన్నారు చిరంజీవి.
మహేశ్ ఫ్యామిలీకి అనిల్ సానుభూతి
మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణంపై విజయవంతమైన చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో 'రమేష్ బాబు గారి మరణ వార్త విని దిగ్బ్రాంతికి లోనయ్యాను. మహేశ్ బాబు గారితో పాటు ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి' అంటూ పోస్ట్ చేశాడు.
రమేశ్ బాబు మరణం దిగ్భ్రాంతికరం
రమేష్ బాబు ఇక లేడన్న వార్తపై ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'నటుడు, నిర్మాత, ఘట్టమనేని రమేశ్ బాబు గారి అకాల మరణం దిగ్భ్రాంతికరం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ.. ఘట్టమనేని కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని పేర్కొన్నారు.
రమేష్ మృతిపై గోపీచంద్ విచారం
రమేష్ బాబు మరణ వార్తను విన్న తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'రమేష్ బాబు గారి మరణ వార్త విని షాకయ్యాను. ఇది చాలా విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను' అంటూ రాసుకొచ్చాడు.
చాలా బాధగా ఉందన్న హరీష్ శంకర్
ప్రముఖ నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు మృతిపై టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'రమేష్ బాబు గారు ఇక లేరన్న వార్త విని షాక్‌కు గురయ్యాను. ఇది చాలా బాధాకరమైన విషయం. మహేశ్ బాబు గారితో పాటు వాళ్ల కుటుంబానికి శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అంటూ పోస్ట్ చేశాడు.
రమేష్ బాబు మృతిపై నితిన్ ట్వీట్
మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు మరణంపై యంగ్ హీరో నితిన్ స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'జీ రమేష్ బాబు గారి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.
రమేష్ బాబు మరణంపై వరుణ్ తేజ్
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు రమేష్ బాబు మృతిపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఈ మేరకు అతడి ట్విట్టర్ ఖాతాలో 'ఘట్టమనేని రమేష్ బాబు గారి అకాల మరణం విచారకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఓం శాంతి' అంటూ పోస్ట్ చేశాడు.
రమేష్‌కు సురేందర్ రెడ్డి సంతాపం
ప్రముఖ నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు మృతిపై టాలీవుడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో 'రమేష్ బాబు గారి మరణవార్త విని షాక్ అయ్యాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అంటూ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











