twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ramesh babu death: చిన్న ఎన్టీఆర్‌గా రమేష్ బాబు.. కృష్ణ ఆ కండీషన్ పెట్టడంతో సినిమాలకు దూరం!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. రెండేళ్ల కాలంలోనే పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు పలు రకాల సమస్యలతో కన్నుమూశారు. అందులో నటీనటులు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, పీఆర్‌లు కూడా ఉన్నారు. దీంతో కొద్ది రోజుల వ్యవధిలోనే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్‌లో మరో పెను విషాదం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు, మహేశ్ బాబు అన్నయ్య రమేష్ బాబు శనివారం కన్నుమూశారు. 56 ఏళ్ల వయసున్న ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. కొన్నింటిని నిర్మించారు. ఈ నేపథ్యంలో రమేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను గురించి తెలుసుకుందాం పదండి!

     ఆ సమస్యతో రమేష్ బాబు మృతి

    ఆ సమస్యతో రమేష్ బాబు మృతి

    ప్రముఖ నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ఆస్పతికి తరలించారు. అయితే, అప్పటికే రమేశ్‌బాబు తుదిశ్వాసను విడిచినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు.

    షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!

    చివరి చూపుకు నోచుకోని మహేశ్

    చివరి చూపుకు నోచుకోని మహేశ్

    సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీంతో ఇప్పుడు రమేష్ బాబును కడసారి చూసుకోడానికి అతడు వచ్చే పరిస్థితులు లేవు. అంతేకాదు, కరోనా జాగ్రత్తలు పాటించి అంత్యక్రియలను కూడా చాలా తక్కువ మందితోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా వదిలారు.

    అభిమానులు, ప్రముఖుల పోస్ట్

    అభిమానులు, ప్రముఖుల పోస్ట్

    సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆయన మరణంపై ఫ్యామిలీ అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు. దీంతో రమేష్ బాబు పేరు ట్విట్టర్‌లో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

    ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!

    రమేష్ బాబు సినీ ప్రస్థానం ఇలా

    రమేష్ బాబు సినీ ప్రస్థానం ఇలా

    సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రమేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్టుగా, హీరోగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఎన్నో రకాలుగా సినీ రంగానికి సేవలు అందించారు. సుదీర్ఘ ప్రయాణంలో రమేష్ బాబు 17 సినిమాల్లో నటించారు. రెండు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కానీ, కెరీర్‌ను కొనసాగించడంలో మాత్రం సక్సెస్ కాలేదు.

     చిన్న ఎన్టీఆర్‌లాగ రమేష్ బాబు

    చిన్న ఎన్టీఆర్‌లాగ రమేష్ బాబు

    రమేష్ బాబు 1974లో వచ్చిన 'అల్లూరి సీతారామరాజు' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణ, నందమూరి తారక రామారావు కలిసి నటించిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలోనూ కనిపించాడు. ఇందులో రమేష్ చిన్నప్పటి ఎన్టీఆర్‌గా కనిపించారు. 'దొంగలకు దొంగ', 'అన్నదమ్ముల సవాల్‌' వంటి చిత్రాల్లోనూ చైల్డ్ ఆర్టిస్టుగా చేశారు.

    జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్

    కృష్ణ ఆ కండీషన్‌ను పెట్టడంతో

    కృష్ణ ఆ కండీషన్‌ను పెట్టడంతో

    బాల నటుడుగా చేసిన తర్వాత కొన్ని చిత్రాల్లో యువ నటుడి పాత్రలోనూ కనిపించారు రమేష్ బాబు. అయితే, ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరం అయ్యారు. దీనికి కారణం డిగ్రీ పూర్తి చేసిన తర్వాతనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని తండ్రి కృష్ణ కండీషన్ పెట్టడమేనని రమేష్ బాబు స్వయంగా తెలిపారు. దురదృష్టవశాత్తూ ఆయన ఎన్నో సినిమాలు చేయలేకపోయారు.

    English summary
    Mahesh Babu's elder brother actor, producer Ghattamaneni Ramesh Babu passed away on Saturday Due to liver problems. Let We Know about His Film Career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X