Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మిరపకాయ్ కాదు ‘స్వీట్ మిరపకాయ్’...
ఎల్లో ప్లవర్స్ పతాకంపై రవితేజ హీరోగా రమేష్ పుప్పాల నిర్మాతగా 'మిరపకాయ్" సినిమా సంక్రాంతి రేస్ లో వచ్చిన విషయం తెలిసిందే. రవితేజ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన 'మిరపకాయ్" సంక్రాంతి రేసులో విజేతగా నిలిచింది. నిర్మాతగా నాకు తొలి విజయాన్ని అందించింది. మొదటి వారంలోనే 17కోట్ల 2 లక్షల 37వే రూపాయల షేర్ వసూలు చేసి, రవితేజ చిత్రాల్లోనే లఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది అని నిన్న హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత రమేష్ పుప్పాల సంతోషం వ్యక్తంచేశారు.
భవన నిర్మాణ రంగం నుండి చిత్ర నిర్మాణ రంగంలోకి రావడానికి నాకు ఇన్ స్పిరేషన్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్. వారి చిత్రాల నిర్మాణాన్ని పరిశీలించాక నాక్కూడా సినిమా చేయాలనిపించింది. తర్వాత యంగ్ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన కథ వినగానే, రవితేజ శైలికి సరైనదనిపించింది. మిరపకాయ్ అంటే రవితేజే అని విధంగా తన ప్రతిభను మరో సారి చాటుకొన్నాడు. ఈ సినిమాకి థమన్ అందించిన సంగీతం ఎంతో హెల్ప్ అయింది. ఈ సినిమా పంపిణీదారులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వసూళ్లు కూడా ఆశ్చర్యపరిచే రీతిలో ఉన్నాయి. నిర్మాత సినీ ఇండస్ట్రీకి కొత్త అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ అనేది కనపడకుండా దర్శకుడు హరీష్ శంకర్, హీరో రవితేజ బాగా సహకరించారు. ముందు ముందు నేనే మరిన్ని భారి చిత్రాల నిర్మాణాని పుణాది వేసింది మిరపకాయ్. హీరోయిన్లుగా నటించిన ధీక్షాసేథ్, రిచా గంగోపాద్యాయ పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నలిచాయి.